శివయ్య నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాశావా..

On
శివయ్య నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాశావా..

  • శివుడికి లేఖ రాసి సూసైడ్ చేసుకున్న యువకుడు
  • చావు కన్నా బ్రతకడమే కష్టం అని.. మీ బిడ్డలైన మా తలరాత ఇలాగేనా అంటూ ప్రశ్నించాడు.

శివాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు మన పెద్దలు.. ప్రాణం పోసేవాడు ఆయనే ప్రాణం తీసేవాడు ఆయనే అన్న మాట అక్షరాల సత్యమైంది.. అలా ప్రాణం పోసిన ఆయన సరిగా పుట్టించలేదో మరి.. శివుడు పై కోపం వచ్చిన ఓ యువకుడు"శివయ్య నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా?" అంటూ దేవుడికి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది.  నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాసావా? నీ కొడుకు అయితే ఇలానే రాస్తావా? మేము నీ కొడుకులం కాదా? అంటూ దేవుడిని నిలదీస్తూ  రోహిత్ అనే యువకుడు లేఖ రాశాడు. వివరాల్లోకి వెళ్తే..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన దీటి రోహిత్(25) అనే వ్యక్తి ఎమ్మెస్సీ పూర్తి చేసి ప్రస్తుతం బీఎడ్ చదువుతున్నాడు. డాక్టర్ అవ్వాలనే తన కల నెరవేరక ఎప్పుడూ అసంతృప్తిగానే ఉండేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది దేవుడికి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక మంచి ఆత్మహత్య లేఖ రాయాలన్న తన కోరిక నెరవేరిందని, చావడం కంటే బ్రతకడంలోనే బాధ ఎక్కువ అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసి ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ చూసి విస్సుపోయారు. వారి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం, ఘటన స్థలంలో దొరికి ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.IMG-20250707-WA0126

Advertisement

Latest News