బతుకమ్మకుంటకు మళ్లీ జీవం పోసిన హైడ్రా..

On
బతుకమ్మకుంటకు మళ్లీ జీవం పోసిన హైడ్రా..

  • బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా..
    8కోట్ల నిధులతో అభివృద్ధి... సెప్టెంబర్ లో ప్రజలకు అందుబాటులోకి..
    5ఎకరాలు మరింత విస్తీర్ణం పెంచిన అధికారులు
    రంగనాథ్ ని పొగడ్తలతో ముంచెత్తిన స్థానికులు

By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
అంబర్ పేట్ బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం వచ్చింది. చెరువుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా (hydraa) విజయంలో ఈ చెరువును తమ డెవలప్మెంట్ ఖాతాలో వేసుకుంది. సుమారు 8కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సర్వాంగసుందరంగా తీర్చిదిద్దింది. సెప్టెంబర్ నాటికి చెరువు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు మరింత చేరువ చేసేందుకు శరవేగంగా పనులు చేపట్టింది. 
హైడ్రా అధికారి రంగనాథ్ రంగంలోకి దిగిన తరువాత బతుకమ్మ కుంటపై (bathukamma kunta20250708_091915) ప్రత్యేక శ్రద్ద చూపించారు. దీనిపై స్థానికంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా కోర్టుకి ఆధారాలు సమర్పించారు. 14ఎకరాలు ఉన్న కుంట 5 ఎకరాలకు కుదించుకు పోయిందని తెలిపింది. దీనితో హైకోర్టు హైడ్రాకే సపోర్ట్ చేసింది. కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రంగనాథ్ నేతృత్వంలో ప్రత్యేక టీమ్ రంగంలోకి దిగి ఆక్రమణ దారుల భరతం పట్టారు. అక్రమ కట్టడాలను నేలమట్టం చేసి చెరువును మరింత విస్తరించారు. అనంతరం ప్రభుత్వం 8 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. అవరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పింది. మట్టి చెత్త చెదారంతో పూర్తిగా కనుమరుగైన బతుకమ్మ కుంట ఇప్పుడు నీటితో కళకళలాడుతోంది. ఫిబ్రవరి నుండి పనులు చేపట్టింది. హైడ్రా మట్టి తవ్వకాలు జరుపుతుండగా అడుగులోతుకే నీళ్లు దర్శనం ఇచ్చాయి. వాటర్ పైప్ లైన్ అంటూ అప్పట్లో పెద్ద  దుష్ ప్రచారం జరిగింది. అయిన వెనుకడుగు వేయని హైడ్రా అకుంఠిత దీక్షతో పనులకు బ్రేక్ పడకుండా ముందుకు సాగింది. సుమారు 90శాతం పనులు పూర్తి అయ్యాయని సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయిలో జనాలకు అందుబాటులోకి తెస్తామని హైడ్రా అధికారి రంగనాథ్ తెలిపారు. బోటింగ్, వాకింగ్ ప్లాట్ ఫామ్, చిల్డ్రన్స్ పార్క్ ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు. ఇక బతుకమ్మ కుంటకు జీవం పోసిన హైడ్రా మిగతా చెరువులను సైతం అభివృద్ధి చేసేందుకు బిజీ అయ్యింది.

Advertisement

Latest News