బేగంపేట ఎయిర్‌పోర్ట్ చుట్టూ భవనాల కూల్చివేతకు ఆదేశం

On
బేగంపేట ఎయిర్‌పోర్ట్ చుట్టూ భవనాల కూల్చివేతకు ఆదేశం

  హైదరాబాద్:నగరంలోని బేగంపేట విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానాల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నాయనే కారణంతో బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో తమ నివాసాలను కోల్పోతామని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల ఎయిరిండియా విమాన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ దేశవ్యాప్తంగా విమానాశ్రయాల భద్రతపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా విమానాశ్రయాల సమీపంలోని నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే 'ఎయిర్‌క్రాఫ్ట్ డిమోలిషన్ ఆఫ్ ఆబ్‌స్ట్రక్షన్ రూల్స్ 2025' పేరుతో ఒక ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.ఈ నిబంధనల ప్రకారం, ఏరోడ్రోమ్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాల ఎత్తును తగ్గించడం లేదా అవసరమైతే పూర్తిగా కూల్చివేయడం వంటి చర్యలు చేపట్టనున్నారు. ఈ కొత్త నిబంధనల నేపథ్యంలోనే అధికారులు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయ పరిసరాల్లో ఉన్న బహుళ అంతస్తుల భవనాలపై దృష్టి పెట్టారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించిన కొన్ని నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యలతో దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న ప్రజలు ఒక్కసారిగా నిరాశ్రయులయ్యే పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Latest News

మహిళలంటే వైసీపీ నేతలకు ఎందుకంత ద్వేషం? మహిళలంటే వైసీపీ నేతలకు ఎందుకంత ద్వేషం?
* ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు* రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదు : మంత్రి సవిత* నల్లపురెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్...
ముచ్చుమర్రి బాలిక అదృశ్యమై..ఏడాది పూర్తి..! కేసులో పురోగతి ఏది? బాధితులకు న్యాయమెప్పుడు?
హైదరాబాద్ లో టెన్షన్.. టెన్షన్.. పలుచోట్ల బాంబు బెదిరింపు..
బతుకమ్మకుంటకు మళ్లీ జీవం పోసిన హైడ్రా..
అమెరికాలో మూడవ పార్టీకి స్థానం ఉందా?
అమెరికాలో రోడ్డుప్రమాదం.. హైదరాబాద్ కుటుంబం సజీవదహనం
వేడెక్కిన ఏపీ బ్యూరోక్రసీ!