మిస్ వరల్డ్ ఫైనల్ లిస్ట్ లో 24మంది
By Ravi
On
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. 24 మంది ఫైనలిస్టుల జాబితాను మిస్ వరల్డ్ నిర్వాహక సంస్థ ప్రకటించింది. ఈ లిస్టులో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాకు కూడా చోటు దక్కింది. రేపు మరింత కీలకమైన టాప్ 10 పోటీదారుల ఎంపిక జరగనుంది. ఈ నెల 31న HICCలో ఫైనల్స్ జరగనుండగా ఆ పోటీలలో టాప్ 10 కంటెస్టెంట్లు పాల్గొననున్నారు. ఇక తాజాగా ప్రకటించిన టాప్ 24లో జాబితాలో ఇండియాతో పాటూ అమెరికా, నైజీరియా, పోలెండ్, మాల్టా, ఇండోనేషియా, ఎస్టోనియా, బ్రెజిల్, నెదర్లాండ్స్, జెచ్ రిపబ్లిక్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, శ్రీలంక, కామెరూన్, ఫిలిప్పీన్స్, ఇటలీ, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జర్మనీ, సైమన్ ఐస్లాండ్స్, వేల్స్, జమైకా, ఇథియోఫియా, ఐర్లాండ్, కెన్యా దేశాల అందాల తారలు ఉన్నారు.
Tags:
Latest News
30 Jul 2025 09:56:49
పనుల్లో నిమగ్నమైన శామీర్పేట కళాకారులు..
గత ఏడాది అరుణాచలం..ఈ ఏడాది స్వర్ణగిరి..
ప్రతియేటా కొత్త తరహా ఏర్పాట్లతో ఆకట్టుకుంటున్న గణేష్..