ఛీ..ఛీ.. ఇదేం దందారా నాయనా..
By V KRISHNA
On
- ఇండియన్ స్పెర్మ్ కేంద్రంలో తనిఖీలు..
- వైద్యశాఖ, క్లూస్ టీమ్స్, పోలీసుల సోదాలు..
- ల్యాబ్ లో ఉన్న వీర్యకణాలు, రికార్డ్స్ సీజ్..
- దేశవ్యాప్తంగా మాఫియా నెట్ వర్క్ ఉన్నట్లు అనుమానం..
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
సృష్టి మూలాల ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.. పిల్లల కోసం తల్లులు కావాలని వచ్చే మహిళలకు భర్తది కాకుండా వేరే వ్యక్తుల వీర్యకణాలు పంపి గర్భవతిని చేయడం ఒకవేళ అబార్షన్ అయితే అక్కడే సిద్ధంగా ఉన్న మరో పసికందును డెలివరీలో బాబు పాప అంటూ అందించి లక్షలు దోచేసిన వైనం అందరికి తెలిసిందే. అయితే దీనిపై సిటీ కమిషనరేట్ లోని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. సృష్టి మూలాల కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దర్యాప్తు ఆసక్తికరమైన అంశాలు బయట పడ్డాయి. సృష్టికి సపోర్ట్ గా ఉన్న ఇండియన్ స్పెర్మ్ టెక్ సెంటర్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించారు. రోడ్లపై పడుకొని ఉన్న బిచ్చగాళ్లకు బీర్, బిర్యానీ ఆశ చూపి వీర్యం సేకరించడం, యాచక వృత్తిలో ఉన్న మహిళలకు డబ్బులు అందించి అండం సేకరించడం ఇండియన్ స్పెర్మ్ టెక్ సెంటర్ చేస్తుందని తెలిసింది. అలా తమ వద్ద సేకరణ పూర్తి కాగానే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ తో పాటు ఇలాంటి సంస్థలకు విక్రయాలు చేసి డబ్బు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. దీనితో పోలీసులు
ఇండియన్ స్పెర్మ్ కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ, క్లూస్ టీం అధికారులు, పోలీసులు తనిఖీలు చేశారు. అక్కడ కుప్పలు తెప్పలుగా ల్యాబ్ లో ఉన్న వీర్యకణాల శాంపిల్స్ సీజ్ చేసి ల్యాబ్ కి పంపించారు.
సృష్టి సెంటర్ వ్యవహారం వెలుగు చూడటంతో ఒక్కక్కటిగా ఉన్న చైన్ లింక్స్ పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్నాయి. సృష్టి సిబ్బంది ఇతర ప్రాంతాల నుండి బతుకు దేరువు కోసం వచ్చే వారి ఉద్యోగం పేరుతో వీర్యం కలెక్ట్ చేయడం, అమ్మాయిల నుండి అండం లేదా సరోగసి చేయడం. వారికి పుట్టిన పిల్లలను లక్షల్లో విక్రయించడం వంటి విషయాలు బయటపడ్డాయి. అయితే ఒక అడుగు ముందుకు అన్నట్లు ఇండియన్ స్పెర్మ్ కేంద్రం దిమ్మతిరిగే వ్యాపారం చేస్తోందని తెలిసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, గౌలిగూడా, జెబిఎస్ ఇలా సిటీ రోడ్లపై యాచక వృత్తి, చిత్తుకాగితలు సేకరీంచే వారే వీరి బిజినెస్ కి పెట్టుబడి అని తనిఖీల్లో తేలింది. ఇలాంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్లు సిటీలో అనేకం ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. ఇక ఇండియన్ స్పెర్మ్ సంస్థకు ఏఏ సెంటర్స్ టచ్ లో ఉన్నాయి. ఎవరెవరితో వ్యాపారాలు చేస్తోంది అని కూపీ లాగుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో వీటికి బ్రాంచ్ లు, టచ్ లో ఉన్న సంస్థలు చాలా అని తెలుసుకున్న పోలీసులు వాటి వివరాలు సేకరిస్తున్నారు.
మొదట్లో పోలీసులు ఇదేదో చిన్న కేసుగా భావించారు. తవ్వినకొద్ది గోతి పెద్దది అయినట్లు సృష్టి నుండి మొదలు పెడితే దేశవ్యాప్తంగా ఓ మాఫియా తరహాలో నెట్ వర్క్ ఉందని తెలిసింది. ఈ విషయం గుట్టురట్టు చేసిన నార్త్ జోన్ పోలీసులను సీపీ సి.వి. ఆనంద్ అభినందించారు. వీటి మూలాల పూర్తిగా తెలుసుకొని వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న 4 టీమ్ లతో పాటు అదనంగా మరో రెండు టీమ్స్ ఏర్పాటు చేశారు. తీగలాగితే డొంకంతా కదిలినట్లు మొత్తం నెట్ వర్క్ బయటపడుతోంది. సృష్టి కేసులో జైల్ లో ఉన్న నిందితులను విచారిస్తే మరింత సమాచారం తెలుస్తుందని భావించిన నార్త్ జోన్ పోలీసులు వారి కస్టడీ కోసం సికింద్రాబాద్ కోర్ట్ లో పిటిషన్ వేశారు. ఇక సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కి లింక్ గా ఉన్న బ్లూ సీ ఎదురుగా ఉన్న ఇండియా స్పెర్మ్ సెంటర్లో దాదాపు అయిదు గంటలపాటు అధికారులు తనఖీలు జరిపారు. అక్కడ ల్యాబ్ లో ఉన్న వీర్యకణాలను, రికార్డ్స్, కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు సిసి ఫుటేజ్ లు సేకరించి వాటిని సీజ్ చేశారు. ఈ దందా రాష్ట్రం, దేశం దాటి ప్రపంచ వ్యాప్తంగా పాకిందని పోలీసుల అనుమానం. చూడాలి మరి పోలీసుల దర్యాప్తులో ఇంకా ఎలాంటి విషయాలు, ఆర్గనైజేషన్లు బయటపడుతాయో.
Related Posts
Latest News
29 Jul 2025 22:11:11
హైదరాబాద్:- ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ ఫణగిరికాలనీ ఆనుకొని ఉన్న మూసినది ఒడ్డున ఉన్న శివాలయం వద్ద ముసలి కలకలం రేగింది. మూసినది ఒడ్డున సంచరించే నాలుగు...