అనురాధ భవిష్యవాణితో ముగిసిన పాతబస్తీ బోనాలు..

On
అనురాధ భవిష్యవాణితో ముగిసిన పాతబస్తీ బోనాలు..

పాతబస్తీలోని చారిత్రాత్మకమైన లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క రంగం కార్యక్రమంలో అనురాధ భవిష్యవాణి వినిపించారు. అనంతరం హరిబౌలి లోని శ్రీ అక్కన్న మాదన్న దేవాలయ ప్రాంగణం నందు నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ జెండా ఊపి ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు మరియు తొట్టెల ఊరేగింపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాజా భజంత్రీలు నడుమ పోతరాజుల నృత్యాలతో ఆకట్టుకునేలా వివిధ వేషాధారణలో పలువురిని ఆకర్షించాయి .ఈ ఊరేగింపు ఉప్పుగూడ, గౌలిపుర, ఛత్రినాక, లాల్ దర్వాజా మోడ్, శాలిబండ, చార్మినార్,  పత్తర్ గట్టి. మీదుగా నయాపూల్ లోని ఢిల్లీ దర్వాజా మహంకాళి ఆలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ శ్రీ మహంకాళి  బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు గోపిశెట్టి రాఘవేందర్ మరియు ఉమ్మడి దేవాలయాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఊరేగింపులో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఊరేగింపు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు  సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ లో నిఘా నిర్వహిస్తూ భారీ బందోబస్తు నిర్వహించారు.

Advertisement

Latest News

 పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్ పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్
హైదరాబాద్: వనస్థలిపురంలో విషాదం అలుముకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని ఓ కుటుంబ సభ్యులు ఆసుపత్రిపాలైనారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో నివాసం వుండే శ్రీనివాస్ ఇంట్లో...
మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ..
భర్త పుట్టినరోజుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భార్య..
జుపే గేమ్ యాజమాన్యంపై కేసు నమోదు
అమ్మ వారికి బోనం సమర్పించిన బండ్లగూడ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్
నిషా నషాలానికి ఎక్కి.. పార్కింగ్ చేసిన వాహనాలపై చూపించాడు
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బొంగునూరి కిషోర్ రెడ్డి