స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్..

On
స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్..

  • పనుల్లో నిమగ్నమైన శామీర్పేట కళాకారులు..
  • గత ఏడాది అరుణాచలం..ఈ ఏడాది స్వర్ణగిరి..
  • ప్రతియేటా కొత్త తరహా ఏర్పాట్లతో ఆకట్టుకుంటున్న గణేష్..

మహేశ్వరం:  తెలుగు రాష్ట్రాల్లో గణనాధుని లడ్డు అంటేనే గుర్తొచ్చేది బాలాపూర్. ఈ లడ్డు విశేషమైన ఆదరణ కూడగట్టుకున్నది. ప్రతి ఏడాది కమిటీ సభ్యులు కొత్త కొత్త సెట్టింగ్స్ ఏర్పాటు చేసి రికార్డ్ బద్దలు కొడుతున్నారు. గత సంవత్సరం అరుణాచలం ఏర్పాటు చేసి అక్కడికి వెళ్లి దేవాలయం చూడలేని భక్తుల కోర్కెలు తీర్చేలా రూపొందించారు. నెలరోజుల ముందుగానే పనులు ప్రారంభించి వినాయక చవితి ఒక్కరోజు ముందు సిద్ధం చేస్తారు. అలా రూపొందించే సెట్టింగ్స్, ఏర్పాట్లను తెలుగు రాష్ట్రాల నుండి పెద్దఎత్తున జనం వచ్చి తిలకిస్తారు. బాలపూర్ లడ్డు వేలం పాట అయ్యాకే భాగ్యనగరంలో గల్లిగల్లీలో కొలువుదీరిన గణనాధులు ట్యాంక్ బండ్ నిమజ్జనానికి బయలుదేరుతాయి. హైట్ లో ఖైరతాబాద్ గణనాధుడు అయితే.. లడ్డులో బాలపూర్ గణేష్ కి ఎవ్వరూ పోటీ పడలేరు. ఇక 2025వ సంవత్సరానికి  బాలాపూర్ వినాయకుని మండపం సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి దేవాలయ  నమూనా ఏర్పాటు చేస్తున్నామని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. శామీర్పేట్ కళాకారుల బృందం ఈ పనులు మొదలు పెట్టింది. ప్రతి సంవత్సరం కొత్త ఆకర్షణతో ప్రజలను  ఆకట్టుకుంటున్న బాలాపూర్ గణనాథుడు ఈ సంవత్సరం మరో కొత్త నమూనాతో ప్రజలను ఆకట్టుకోబోతున్నాడని అధ్యక్షులు తెలిపారు. ఇటీవల కాలంలో స్వర్ణగిరి వెంకటేశ్వర ఆలయం చాలా ఫేమస్ అయిన విషయం అందరికి తెలిసిందే. అందుకే ఈ సెట్టింగ్స్ బాలపూర్ మండపం వద్ద నిర్ణయం తీసుకుంటున్నట్లు కమిటీ తెలిపింది. కర్రపుజాతో కమిటీ సభ్యులు పనులు ప్రారంభించారు.

Advertisement

Latest News

కంటెంట్ తో కోట్లు కొట్టేశారు.. హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.. కంటెంట్ తో కోట్లు కొట్టేశారు.. హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు..
- శాటిలైట్ హ్యాక్ చేసి.. సినిమాలు పైరసీ చేశారు..- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పైరసీ- ఒరిజినల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోవు- తెలుగు సినీ పరిశ్రమకు రూ. 3700...
మూసీలో ఆదిత్య అక్రమ నిర్మాణం.. హైడ్రాకు పట్టని వైనం..
ఎటు చూసినా మూసీ ప్రవాహం.. హైదరాబాద్ అల్లకల్లోలం..
వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు
దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.
ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని కలిసిన అంగన్వాడి టీచర్లు
ఆ స్కూల్ లో పాఠాలు కాదు..డ్రగ్స్ తయారీ నేర్పిస్తారు..