అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

On
అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

కుత్బుల్లాపూర్, జూలై 24. పెట్ బషీరాబాద్ లోని అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సోలిస్ కంటి హాస్పిటల్ కొంపల్లి శాఖ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ముఖ్యఅతిథిగా మేడ్చల్ జోన్ ట్రాఫిక్ ఏసిపి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో మొత్తం 74 మంది ట్రాఫిక్ మరియు ఇతర సిబ్బందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ట్రాఫిక్ ఏసిపి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో ఉండే పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సిబ్బంది అందరూ ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అల్వాల్ ట్రాఫిక్ సిఐ నాగరాజు, ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి,ఎస్ఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది, సోలిస్ కంటి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20250725-WA0012

IMG-20250725-WA0013

Advertisement

Latest News

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ నేతలు ముట్టడి చేస్తారని సమాచారం.. కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న పార్టీ...
శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు డిఎస్పీల మృతి..
హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ
దయచేసి ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి..