పోప్‌ ఎన్నికకు రంగం సిద్ధం కానుంది..

By Ravi
On
పోప్‌ ఎన్నికకు రంగం సిద్ధం కానుంది..

కేథలిక్‌ ప్రపంచ ఆధ్యాత్మిక అధినేత, వాటికన్‌ దేశాధినేతగా బాధ్యతలు చేపట్టే నెక్ట్స్ పోప్‌ ను సెలెక్ట్ చేసే ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. ఇందుకోసం 70 దేశాలకు చెందిన 133 మంది క్యాథలిక్‌ మతగురువులైన కార్డినళ్లు వాటికన్‌ లోని సిస్టీన్‌ చాపెల్‌ చర్చిలో సమావేశం కానున్నారు. ప్రిన్సెస్‌ ఆఫ్‌ చర్చ్‌ గా ప్రసిద్ధులైన అత్యున్నత స్థాయి కార్డినళ్లు ముందుగా లిటనీ ఆఫ్‌ సెయింట్స్‌ గీతాలాపనల మధ్య చాపెల్‌లోకి ప్రవేశిస్తారు. 

వారు గోప్యతా ప్రమాణం స్వీకరించిన తర్వాత రహస్య బ్యాలెట్‌ ద్వారా ఓటు వేస్తారు. ఈ ఓటింగులో మూడింట రెండొంతుల ఓట్లు, అంటే 89 ఓట్లు సాధించిన వ్యక్తి పోప్‌గా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. నిర్దిష్ట సంఖ్యలో ఓట్లు సాధించిన వ్యక్తి ఎంపికయ్యే వరకూ ఉదయం రెండుసార్లు, సాయంత్రం రెండుసార్లు ఓటింగ్‌ నిర్వహిస్తారు. తద్వారా పోప్ ఎన్నిక జరుగుతుంది. ఈ క్రమంలో అక్కడి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Latest News

అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం
పేదలకు దూరమవుతున్న ఆధునిక వైద్య సేవలు నిమ్స్ ‘ముఖ్యుడి' నిర్లక్ష్యంతో గాడితప్పిన పాలన కేసులు, అవినీతి ఆరోపణలు, అంతర్గత కలహాలు అల్లకల్లోలం అయినా పట్టని పాలకులు, ప్రభుత్వ...
స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్..
ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..
ఛీ..ఛీ.. ఇదేం దందారా నాయనా..
మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక..
కడప జిల్లా పోలీస్ శాఖ ఘనత
అమ్మతనాన్నే అపహాస్యం చేసిన సృష్టి సెంటర్..