మత్తుతో వ్యాపారం.. కోట్లు కొల్లగొట్టిన వైనం..

On
మత్తుతో వ్యాపారం.. కోట్లు కొల్లగొట్టిన వైనం..

తెలంగాణలో జోరుగా నకిలీ ఎంసీ విస్కీ తయారీ..
రైస్ మిల్లులో గుట్టుగా తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు
నిందితులకు సహకరిస్తున్న కొందరు బార్స్, వైన్స్ యజమానులు
కూపీ లాగే పనిలో పడ్డ ఎక్సైజ్ అధికారులు..
తప్పు చేశారని తెలిస్తే జైలే కాదు.. లైసెన్సులు రద్దు..

By. V. Krishna kumar
Tpn: special desk..
మాదక ద్రవ్యాలను అరికట్టడంలో తెలంగాణ ఎకైజ్ శాఖ(telangana excise departmentIMG-20250722-WA0111IMG-20250722-WA0111) దూసుకు పోతోంది. స్పెషల్ డ్రైవ్ పేరుతో మాఫియాకి నిద్రలేకుండా చేస్తోంది. నిత్యం దాడులతో దడపుట్టిస్తూ నిందితులు ఊచలు లెక్కించేలా చేస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెడుతోంది. డ్రగ్స్, గంజాయి, కల్తీ కల్లుతో పాటు తాజాగా నకిలీ లిక్కర్ తయారీపై కన్నెసింది. కల్తీ కల్లు వ్యవహారం పూర్తి కాకుండానే నకిలీ మద్యం వెెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆంధ్రలో తీగలాగితే తెలంగాణలో డొంక కదలినట్లు పెద్ద నెట్ వర్క్ ను ఛేదించింది. శివారు ప్రాంతంలో ఓ రైైస్ మిల్ లో ఎవరీకి అనుమానం రాకుండా గుట్టుగా  స్పిరిట్ తో నకిలీ ఎం.సీ విస్కీ తయారు చేస్తున్న ముఠాను అరెస్టు చేసింది.ఈ ముఠా గత కొన్నేళ్లుగా ఎవరీకీ అనుమానం రాకుండా నకిలీ విస్కీ తయారు చేసి మార్కెట్లో సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. అంతే దీని వెనుక ఉన్న డాన్ ల ఆగడాలకు చెక్  పేట్టేందుకు పోలీసులు రెడీ అయ్యారు. 
ఏలా దొరికారు అంటే....
ఆంధ్రప్రదేశ్ లో గత  ప్రభుత్వం ప్యూరియస్ లిక్కర్ దందా నడిపింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం దీనికి చెక్ పెట్టి పలువురిని కటకటాలవెలక్కి నెట్టింది. పట్టుబడిన వారిని విచారిస్తే అసలు విషయం తెలిసి తెలంగాణా ఎక్సైజ్ అధికారులకు వివరాలు అందించారు. ఇక అక్కడి నుండి దర్యాప్తు మొదలైంది. మేళ్ల చెరువు మండలం రామాపురంలోని ఒక రైస్ మిళ్లులో ఈ దందా కొనసాగుతోందని గుర్తించారు. అంతే వెంటనే ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ లీడర్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో రైస్ మిల్ పై దాడి చేశారు. పెద్ద మొత్తంలో నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. శివశంకర్, మల్లికార్జున్ , శరణ్ జిత్ సింగ్, శ్రీనివాస్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేవలం వీరు కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వైన్స్ వైన్స్ వ్యాపారులు ఈ ముఠాతో చేతులు కలిపి పెద్ద ఎత్తున ఇరు రాష్ట్రాల ఖాజాను దోచుకున్నట్లు గుర్తించారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ దందా సాగుతున్నట్లు తెలిసింది. బడా బ్రాండ్స్ లో మోసం చేస్తే పట్టుబడతామని ఈ ముఠా తెలివిగా వ్యవహరించి కేవలం ఎంసి విస్కీ తయారు చేసి విక్రయాలు జరిపారు. ముఖ్యంగా పండుగ రోజుల్లో జనాలు విఫరీతమైన రష్ ఉండే సమయంలో అమ్మకాలు చేసి కోట్లు కొల్లగొట్టారు. ఈ ముఠాకు సహకరించిన వైన్స్ షాప్ యజమానుల వివరాలు ఎక్సైజ్ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ముఠాతే చేతులు గలిపిన వారిని అరెస్టు చేయడమే కాకుండా వారిని జైలుకి పంపుతామని, అలాగే వారి లైసెన్సులు కూడా రద్దు చేస్తామని ఎక్సైజ్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం హెచ్చరించారు.
తయారీకి కావాల్సిన వస్తువులు ఎలా సేకరించారు అంటే..
ముందుగా ఈ ముఠా వైన్స్ షాపుల యజమానులను కలిశారు. బెల్ట్ షాపుల్లో తాగి వదిలేసిన ఎంసీ విస్కీ, అలాగా బార్స్ యజమానుల నుండి కూడ అలాంటి బాటిల్స్ కొనుగోలు చేశారు. అంతటితో ఆగకుండా, స్క్రాప్ షాపుల వారితో మాట్లాడి అక్కడి నుండి కూడా కేవలం ఎంసీ విస్కీ ఫుల్ బాటిల్స్ మాత్రమే కొనుగోలు చేశారు. ఆ తరువాత కొన్న బాటిల్స్ ని రైస్ మిల్ కి చేరవేశారు. ఓ ప్రైవేటు కంపెనీ నుండి స్పిరిట్ కొనుగోలు చేసి నకిలీ మద్యం తయారు చేయడం మొదలు పెట్టారు. తయారు చేసిన మద్యాన్ని కాళీ బాటిల్స్ లో నింపి  వాటికి కావాల్సిన మూతలు, లేబుల్ రెడీ చేసి మరీ సప్లై చేశారు. అలా వారి నకిలీ మద్యం మార్కెట్ లో చెలామణి చేశారు.
ఎక్కడెక్కడ గుర్తించారు అంటే...
పట్టుబడిన నిందితులను విచారించిన ఎక్సైజ్ అధికారులకు ఎక్కడెక్కడ ప్రస్తుతం నకిలీ విస్కీ చెలామణి అవుతుందో గుర్తించారు. సూర్యపేట, హుజూర్ నగర్, సిటీ శివారు ప్రాంతాల్లో అవుతున్నట్లు గుర్తించి ఆయా బార్లు, వైన్స్ వివరాలు సేకరించారు. గతంలో 2022లో కూడా ఇబ్రహీంపట్నం, భువనగిరి, రామన్నపేట ప్రాంతాల్లో నకిలీస రాయల్ స్టాగ్ విస్కీ చెలామణిని నాంపల్లి ఎక్సైజ్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అలాగే ఒరిస్సా నుండి వస్తున్న నకిలీ మద్యాన్ని రంగారెెడ్డి టీమ్ బట్టబయలు చేసింది. తాజాగా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్.. నకిలీ ఎంసీ విస్కీ తయారు చేస్తున్న ముఠాకు చెక్ పెట్టింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ డబ్బే ప్రధానంగా దోచుకునే వారు ఎవరైనా వదిలేది లేదని డైరెెక్టర్ షానవాజ్ ఖాసిం హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం పట్టుబడిన ముఠా వెనుకాల ఉన్న, సహకరించిన బార్స్, వైన్స్ యజమానుల భరతం పట్టేందుకు సిద్దమైనారు.
 

Advertisement

Latest News

ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్ ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్
కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామరంలో ప్రేమ పేరుతో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఓ యువతిని ప్రేమ పేరుతో రెండేళ్ల నుంచి వేధిస్తున్నాడు వినయ్(21)అనే...
 ఘనంగా మ‌హాల‌క్ష్మి- మ‌హిళ‌ల  ప్ర‌యాణ వేడుక‌లు..
మత్తుతో వ్యాపారం.. కోట్లు కొల్లగొట్టిన వైనం..
మరోసారి రికార్డ్ బద్దలు కొట్టిన సైబరాబాద్ పోలీసులు
తల్లికి పురుడు పోసిన 108 సిబ్బంది
పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్
మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ..