మాజీ ఆర్థిక శాఖ మంత్రి, వైఎస్ఆర్ సీపీ నాయకులు బుగ్గన బహిరంగ సవాల్
ఏపీఎండీసీకి ఎన్సీడీ జారీ చేయడంపై సవాల్ కి సిద్ధమా అంటూ ట్వీట్
కూటమి ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుండడంపై సర్వత్రా విస్మయం
అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర ఖజానాను తాకట్టు పెట్టిన కూటమి ప్రభుత్వం తాజాగా మరోసారి తప్పు మీద తప్పు చేస్తుండడం పట్ల మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తప్పపట్టారు. హైకోర్టులో కేసు నడుస్తున్నా సరే లెక్క చేయకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా రెండోసారి ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్) బాండ్ల జారీకి సిద్ధమవడంపై ఆయన బహిరంగ సవాల్ విసిరారు.
గత నెలలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులిస్తూ బాండ్లు విడుదల చేసి రూ.3,489 కోట్లు సమీకరించింది. అయితే.. ఇది జరగడానికి ముందే కూటమి ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘనలను అడ్డుకోవాలని హైకోర్టులో పలువురు దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది. విషయం కోర్టు పరిధిలో ఉన్నా సరే.. మే 8న ప్రభుత్వం బాండ్లు జారీ చేయడం దుర్మార్గమన్నారు. ఈ బాండ్లు కొనేవారికి రాష్ట్ర ఖజానాపై హక్కు కల్పించడమే కాకుండా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ భవిష్యత్తు ఆదాయాల పైనా ప్రత్యేక హక్కు ఇచ్చింది. రూ.2 వేల కోట్ల బేస్ వాల్యూతో బాండ్లు జారీచేయగా... రూ.3,489 కోట్ల బాండ్లను పెట్టుబడిదారులు కొనుగోలు చేశారు.
ఆరోపణలు, ప్రభుత్వ చర్యలపట్ల పదే పదే విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా..జాతీయ స్థాయి మీడియాలు ఏపీ ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతున్నా ఖాతరు చేయకుండా ప్రజలకు జవాబుదారీతనాన్ని సైతం విస్మరించి కూటమి ప్రభుత్వం ఈ తరహా చర్యలు చేపట్టడం బాధాకరమన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇంత దిగజారి ప్రవర్తిస్తుండడాన్ని ఆయన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.
https://twitter.com/BugganaRaja/status/1941816748849979599