బాలయ్య స్క్విడ్ గేమ్ ఆడితే..అంతా దబిడిదిబిడే!
వల్డ్ వైడ్ గా ఓటీటీ ప్రేక్షకులకు క్రేజ్‌ని క్రియేట్ చేసిన వెబ్‌సిరీస్ ‘స్క్విడ్‌గేమ్’ (Squid Game). ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడు భాగాల ఈ సిరీస్.. థ్రిల్‌తో పాటు, ఫన్ అందించింది. అయితే తెలుగు సినిమా యాక్టర్లు ‘స్క్విడ్‌గేమ్’ ఆడితే ఎలా ఉంటుందో తమిళ, తెలుగు యాక్టర్స్‌ను ఏఐ ద్వారా క్రియేట్ చేసి, వీడియోలను "అవుట్ ఆఫ్ ది బాక్స్" అనే ఇన్స్టా హ్యాండింగ్ ద్వారా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సెలబ్రిటీల లిస్ట్ లో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ, యాక్ట్రెస్ అనసూయ, యాంకర్ సుమ వాళ్లాయన యాక్టర్ రాజీవ్ కనకాల వచ్చి చేరారు.
‘స్క్విడ్‌గేమ్1’లో ‘ది మ్యాన్ విత్ ది అంబ్రిల్లా’ అనే ఎపిసోడ్ ఆధారంగా వీడియోను క్రియేట్ చేశారు. అందులో వివిధ ఆకారాల్లో స్వీట్‌ను గట్టిగా తయారు చేస్తారు. ఆ స్వీట్ విరిగిపోకుండా ఆ ఆకారాన్ని బయటకు తీయాలి. తాజా వీడియోలో అనసూయ తనకు వచ్చిన త్రిభుజాకారాన్ని సులభంగా బయటకు తీయగా, రాజీవ్ కనకాల అందులో ఫెయిల్ అయ్యారు. దీంతో ఆయన్ను గేమ్ నిర్వాహకులు లాక్కెళ్లిపోతారు. ఇక బాలకృష్ణ కూడా ప్రయత్నించినా రాకపోవడంతో కోపం వచ్చి, ఆ స్వీట్ మొత్తం తినేస్తారు. గేమ్ నిర్వాహకులు ఆయన్ను పట్టుకోవడానికి వస్తారు. అందరినీ బాలయ్యబాబు చితకబాది విసిరి అవతల పడేసే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. అఖండ-2 ట్రైలర్ తరహాలో సాగిన ఈ ఫైట్ ఆయన ఫ్యాన్స్ ని అల్లాడిస్తోంది.
చివరిలో ‘జై బాలయ్య’ అంటూ ఎన్టీఆర్ వాయిస్‌తో వినిపించే స్లోగన్ హైలైట్. ‘స్క్విడ్‌గేమ్’లో హీరో నంబర్ 456. ఏఐ వీడియోలో కూడా బాలకృష్ణ ప్లేయర్ నెం.456గా కనిపించారు. మరి మీరు ఆ వీడియోపై ఓ లుక్కేస్తారా..ఇదిగో లింక్..
https://twitter.com/i/status/1945733746558173457