రాయుడు హత్య కేసులో రూ.30లక్షల ఆఫర్.. పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారు..? రాయుడి చెల్లెలు ప్రశ్నలు
రాయుడు హత్య కేసులో మరో ట్విస్ట్
తమకు రూ.30లక్షలు ఆఫర్ చేశారన్న రాయుడు చెల్లి కీర్తన
పవన్ కల్యాణ్ న్యాయం చేయాలని డిమాండ్
Sekhar
TPN, Tirupati
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్ ఛార్జ్ వినూత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది..! తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి మృతుడు రాయుడు చెల్లెలు కీర్తన శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసి తమ ప్రాణాలకు హాని ఉందని.. భద్రత కల్పించాలని కోరింది. అంతేకాదు వినూత కోటకు రాయుడుకి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. అలాంటి ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇదిలా ఉంటే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైనా కీర్తన సంచలన వ్యాఖ్యలు చేసింది.
చిన్న విషయానికి కూడా స్పందించే పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారంపై ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించింది. పవన్ కల్యాణ్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరింది. తమకు పవన్ కల్యాణ్ ను కలిసి బాధ చెప్పుకునే అవకాశం ఇప్పించాలని మీడియాను కోరింది. మరోవైపు రాయుడు హత్య కేసుపై సైలెంట్ గా ఉంటే రూ.30లక్షలు ఇస్తామని చంపిన వాళ్లే ఆఫర్ చేశారని.. అందుకు తాము అంగీకరించలేదని చెప్పింది.
ఇదిలా ఉంటే శ్రీకాళహస్తి జనసేన ఇన్ ఛార్జ్ వినూత కోట వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న రాయుడు.. ఇటీవల చెన్నైలోని ఓ ప్రాంతంలో విగతజీవిగా కనిపించాడు. అతడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు వినూత కోట, ఆమె భర్త చంద్రబాబుని నిందింతులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది.
ఓ నేతతో ఆధిపత్య పోరు వల్ల ఎమ్మెల్యే జనసేన వీరమహిళ వినుతకు స్పైగా శ్రీనివాసులును ఉపయోగించుకుని వారి వ్యక్తిగత వీడియోలను తన ప్రత్యర్థులకు చేరవేశాడనే అనుమానంతో శ్రీనివాసులును చంపినట్లు ఎఫ్ఐఆర్ లో నిందితులు అంగీకరించినట్లు సమాచారం.