Harihara Veeramallu: హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ సారైనా విడుదల అవుతుందా..?

By PC RAO
On
Harihara Veeramallu: హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ సారైనా విడుదల అవుతుందా..?

హరిహర వీరమల్లుకు రిలీజ్‌కు కొత్త తేదీ

ఇప్పటికే పలుసార్లు వాయిదా

ఈసారైనా రిలీజ్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ చర్చ

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కొత్త మూవీ హరహర వీరమల్లు పార్ట్-1 (Harihara Veeramallu Release Date) సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను జూలై 24న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఎనౌన్స్ చేశారు.  తొలుత ఈనెల 12న సినిమాను విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించినా సీజీ వర్క్ పూర్తి కాలేదంటూ వాయిదా వేశారు. తాజాగా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అవడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మెగా సూర్య మూవీస్ పై ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాకు క్రిష్ డైరెక్టర్ కాగా కొంత భాగం షూట్ తర్వాత ఆయన తప్పుకున్నారు. దీంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్షన్ బాధ్యతలు తీసుకొని పూర్తి చేశారు. ఈ మూవీలో పవన్ సరసన నిధి ఆగర్వాల్ నటిస్తుండగా.. బాబి డియోల్ విలన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు.

 

పవన్ కల్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండటంతో హరిహరవీరమల్లు షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఎన్నికల తర్వాత ఆయన డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు ఆ తర్వాత కాస్త టైమ్ దొరకటంతో వీరమల్లులో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా నిర్మాతపై ఆర్ధిక భారం పడటంతో తాను తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని పవన్ కల్యాణ్ తిరిగి ఇచ్చేశారు.

ఇదిలా ఉంటే హరిహర వీరమల్లును జూన్ 12న విడుదల చేస్తున్నట్లు గతంలో నిర్మాతలు ప్రకటించిన సమయంలో తెలుగురాష్ట్రాల్లో థియేటర్ల బంద్ వ్యవహారం తెరపైకి వచ్చి సంచలనం రేపింది. తన సినిమాపై కుట్రలతోనే ఇలా చేస్తున్నారంటూ ఏకంగా పవన్ కల్యాణే సీరియస్ అయిన పరిస్థితి. ఐతే ఈ పరిస్థితి వెనుక రాజమండ్రి జనసేన ఇన్ ఛార్జ్ అత్తి సత్యనారాయణ ఉన్నారని తెలుసుకొని ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో దిల్ రాజు, అల్లు అరవింద్ హస్తమున్నట్లు ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదని వారు ఖండించారు. మెగాఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు.. వచ్చే నెల 24న అయినా రిజీల్ అవుతుందా లేక టాలీవుడ్ ఇండస్ట్రీలో వాయిదాలపర్వంలో రికార్డు సృష్టిస్తుందో వేచిచూడాలి.

Advertisement

Latest News

ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు
హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరు పట్ల తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది. అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై...
విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.
డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం