శాస్త్రవేత్తల సూచనలతో సాగు చేస్తే ఆదాయం పెరుగుతుంది: బొజ్జల రిషితా రెడ్డి

On
శాస్త్రవేత్తల సూచనలతో సాగు చేస్తే ఆదాయం పెరుగుతుంది: బొజ్జల రిషితా రెడ్డి

శ్రీకాళహస్తి, జూన్ 12

వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు గ్రామంలో గురువారం నిర్వహించిన రైతుల అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జల రిషితా రెడ్డి, శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించిన విధంగా సాగు చేయడం ద్వారా రైతులు అనవసర ఖర్చులను తగ్గించుకొని మంచి దిగుబడి సాధించవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని రాస్ కృషి విజ్ఞాన కేంద్రం, తిరుపతి వారు నిర్వహించగా, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, అభ్యుదయ రైతులు ఇందులో పాల్గొన్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి శాస్త్రవేత్త డా. సుమంతా కుందూ, వ్యవసాయాధికారి సూర్యప్రకాశ్ రెడ్డి, కేవీకే శాస్త్రవేత్త రాము కుమార్ ముఖ్యంగా పాల్గొన్నారు.

రైతులకు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో విత్తనాల ఎంపిక, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకం, పచ్చిరొట్ట పంటలు, డ్రమ్ సీడర్ వాడకంతో వరి సాగు, వ్యవసాయ డ్రోన్లు, జీవన ఎరువులు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ యూరియాను రిషితా రెడ్డి స్వయంగా రైతులకు పంపిణీ చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలు, మొబైల్ యాప్‌ల ప్రాముఖ్యత, పశుపోషణ తదితర అంశాలపై సమాచారం అందించారు.

Advertisement

Latest News

దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..! దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..!
నగరాన్ని ముంచెత్తిన వానఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చిన వాతావరణశాఖభారీ నుంచి అతిభారీ వర్షం పడే ఛాన్స్రోడ్లపైకి వరద నీరు.. భారీగా ట్రాఫిక్‌ ట్రాఫిక్ కష్టాలతో జనజీవనం అస్తవ్యస్తం  
వేల ఎన్ కౌంటర్లు..వందల మంది హతం..తప్పు చేస్తే అక్కడంతే!
మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్.. మద్యం కేసులో అరెస్టుకు రంగం సిద్ధం!
దేశవ్యాప్తంగా బిల్లులు బెంబేలెత్తిస్తుంటే అక్కడ మాత్రం ఫ్రీ కరెంట్!
తల్లికి వందనం..'ప్రైవేటు'కు వరం..ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరం!
బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నట్టేనా?
నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!