పాత కొత్వాల్ భవనానికి.. కొత్త రూపం..

On
పాత కొత్వాల్ భవనానికి.. కొత్త రూపం..

  • 150సంవత్సరాల ఘన చరిత్ర..
    శిథిలావస్థకు చేరిన పాత కమిషనర్ కార్యాలయం..
    కమిషనర్ సి.వి. ఆనంద్ చొరవతో మహర్దశ..
    గ్రీన్కో సహారంతో మరోసారి అభివృద్ధి..

By. V. Krishna kumar

Tpn: స్పెషల్ డెస్క్.20250709_090111

పురానీ హావేలి.. ఆ పేరులోనే పాతబస్తీ భవనం అని ఉంటుంది.. అక్కడ 150ఏళ్ల కిందట నవాబుల కాలం నుండి పాతబస్తీ వేదికగా పరిపాలనా భవనాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సంస్థానం అక్కడి నుండే నడిచేది. ఆ తరువాత నగరానికి కొత్వాల్ ( పోలీస్ కమిషనర్ కార్యాలయం) కార్యాలయంగా పేరు గడించింది.. కాలక్రమేణా బషీర్ బాగ్ అక్కడి నుండి ప్రస్తుతం బంజారాహిల్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లోకి కమిషనర్ కార్యాలయం మారిపోయింది. ప్రస్తుతం పురానీ హావేలి పాత కమిషనర్ ఆఫీస్ అంటూ పేరు పాతుకు పోయిన అక్కడ సౌత్ జోన్ డీసీపీ ఆఫీస్, టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తో పాటు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఈ కార్యాలయాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలని ఇప్పటి కమిషనర్ సి.వి. ఆనంద్ మనసులో పడింది. 
150 సంవత్సరాల నాటి భవనం నాలుగేళ్ల క్రితం పైకప్పు కూలిపోయి పూర్తిగా శిథిలావస్థకు చేరింది. 
హైదరాబాద్ నగర వారసత్వాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పునరుద్ధరణకు పూనుకున్నారు. గ్రీన్కో సిఎండి  అనిల్‌  ఆర్థిక సహకారంతో 2022 డిసెంబర్‌లో పనులు ప్రారంభమయ్యాయి. అయితే 2023 అక్టోబర్‌లో కమిషనర్ ఆనంద్ బదిలీ అయిన తర్వాత ఈ ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయింది. 2024 సెప్టెంబర్‌లో ఆనంద్ తిరిగి పోలీస్ కమిషనర్‌గా నియమితులైన తర్వాత పునరుద్ధరణ పనులకు మరింత వేగం పెంచారు. ఈ పనులను డెక్కన్ టెరైన్ ఏజెన్సీ అధినేత మీర్ ఖాన్ పర్యవేక్షణలో సవాలుతో కూడుకున్న పనులను నాణ్యతతో నిర్వహించారు. మొత్తానికి కార్యాలయం సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. 
హైదరాబాద్ పోలీసింగ్ చరిత్రలో ఈ భవనానికి విశేష ప్రాముఖ్యత ఉంది. పాతబస్తీ పర్యటనల సమయంలో కోత్వాల్‌కు మర్యాదైన కార్యాలయం సిద్ధమైందన్నందున కమిషనర్ ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. తిరిగి కార్యాలయం ప్రజల అందుబాటులో ఉండేలా ప్రారంభించారు. పునరుద్ధరించబడిన ఈ చారిత్రక నిర్మాణం హైదరాబాద్‌ నగరం తమ సాంస్కృతిక, పరిపాలనా వారసత్వాన్ని గౌరవిస్తూ దాన్ని భద్రంగా కొనసాగిస్తుందనడానికి ప్రతీకగా నిలిచింది. కమిషనర్ ఆనంద్ చేపట్టిన ఈ అభివృద్ధి పనులను నిజాం వారసులే కాకుండా, పాతబస్తీలని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Latest News

పవన్ కళ్యాణ్ సవాల్.. నేను సిద్ధమన్న లోకేష్..! పవన్ కళ్యాణ్ సవాల్.. నేను సిద్ధమన్న లోకేష్..!
* మెగా పీటీఎం వేదికగా నారా లోకేష్ ప్రకటన* కోటి మొక్కలు నాటాలని పవన్ సవాల్* పవన్ అన్న సవాల్ స్వీకరిస్తున్నానన్న మంత్రి లోకేష్* ఒక్క విద్యాశాఖలోనే...
రేవంత్ రెడ్డి వాస్తు భయం.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో చర్చకు సిద్ధమా?
ఏపీ మంత్రివర్గంలో మార్పులు తప్పవా..? చంద్రబాబు ఆగ్రహానికి కారణాలు ఇవేనా..?
'ఏఐ'తో దోమలు కంట్రోల్ చేస్తారా ? : మాజీ మంత్రి బుగ్గన సెటైర్లు
టీవీలో వేసినా వదలకుండా చూడాల్సిందే..! పదేళ్లయినా 'బాహుబలి'కి అదే క్రేజ్!
వాహనదారులకు తీపి కబురు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం !
లిక్కర్ స్కామ్ లో ఐఏఎస్ రజత్ భార్గవకు బిగుస్తున్న ఉచ్చు..!