టీవీలో వేసినా వదలకుండా చూడాల్సిందే..! పదేళ్లయినా 'బాహుబలి'కి అదే క్రేజ్!

By Dev
On
 టీవీలో వేసినా వదలకుండా చూడాల్సిందే..! పదేళ్లయినా 'బాహుబలి'కి అదే క్రేజ్!

సరిగ్గా పది సంవత్సరాల క్రితం అంటే 2015 జూలై 10 సరిగ్గా ఇదే రోజు ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి ది బిగినింగ్' సినిమా రిలీజయింది. ప్రభాస్ హీరోగా టాలీవుడ్ లో కనుమరుగైపోయిన పురాతన జానపద వీరుల ఫిక్షన్ కథతో, వందలాది కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమా తీయడం గురించి రిలీజ్ కు ముందు వరకు ఇండస్ట్రీలో ఎన్నో నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. ప్రకటన దశ నుంచి మూడేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ విజువల్ గ్రాండియర్ లో ప్రభాస్ హీరోగా నటించడం ,  ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోవడం వెనువెంటే జరిగిపోయాయి. టాలీవుడ్ నే కాదు యావత్ సినీ పరిశ్రమనే ప్రభావితం చేసే ఒక చరిత్రకు బాహుబలి ది బిగినింగ్ సాక్ష్యంగా నిలిచింది.

బాహుబలి లాంటి అద్భుతాన్ని తీయాలన్న ఆలోచన రాజమౌళికి చందమామ పుస్తకాల అవపోసన పట్టిన సమయంలోనే వచ్చింది. దాన్ని తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ తో పంచుకుంటే శివగామి, కట్టప్ప పాత్రలతో మొదలుపెట్టి రామాయణంలో రాముడి లక్షణాలున్న అమరేంద్ర బాహుబలిని సృష్టించారు. తండ్రి మరణానికి కొడుకు ప్రతీకారం తీర్చుకోవడమనే పాత పాయింట్ ని తీసుకుని దాన్ని ఊహించని మలుపులు ముడిపెట్టి, వెన్నుపోటు పొడవడం ద్వారా కనివిని ఎరుగని ఒక గొప్ప ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో జక్కన్న సాధించిన విజయం ఒక మరవలేని కావ్యఖండం. సాహసంతో తెరకెక్కించిన బాహుబలి సినిమాని క్లాసు మాస్ తేడా లేకుండా  బ్రహ్మరథం పట్టారు.

అప్పటిదాకా ఒక లెక్క బాహుబలి నుంచి ఒక లెక్కలా తెలుగు సినిమా గమనం మారిపోయింది. బాలీవుడ్ ఖాన్లు ఈర్ష్య పడేలా, తలలు పండిన సినీ పెద్దలు విభ్రాంతికి గురయ్యేలా దేశ దేశాల్లో బాహుబలి వందల కోట్లు వసూలు చేయడం సువర్ణాక్షరాలతో శాశ్వతంగా లిఖించబడింది. ఈ సినిమాలోని అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి (శివుడు) పాత్రల్లో ప్రభాస్, భల్లాలదేవుడి పాత్రలో రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్, బిజ్జలదేవగా నాజర్‌ కనిపిస్తారు. ముందు శివగామి పాత్రకు శ్రీదేవిని, కట్టప్ప పాత్రకు సంజయ్‌ దత్‌ను, భల్లాలదేవుడి పాత్రకు జేసన్‌ మమోవా (హాలీవుడ్‌ మూవీ ‘ఆక్వామేన్‌’  ఫేమ్‌)లను అనుకున్నారు కానీ కుదరలేదు. అయితే  శివగామిగా రమ్యకృష్ణ, కట్టప్పగా సత్యరాజ్‌ ఎంత సరిగ్గా సరిపోయారో, బాహుబలికి యాంటీ రోల్‌ అయిన భల్లాలదేవ పాత్రకు రానా ఎంత ఫిట్‌ అయ్యారో చూశాం. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా ప్రభాస్‌ తప్ప ఎవరూ సూట్‌ కాదని ప్రేక్షకులు ప్రశంసించారు. అనుష్క, తమన్నా, నాజర్‌ల నటన సూపర్‌. అందుకే  14 నంది అవార్డులు, జాతీయ పురస్కారం, లెక్కలేనన్ని ప్రైవేట్ అవార్డులు ఎన్నో బాహుబలిని అలంకరించాయి.

ఈ సినిమాలో కాలకేయుడు (ప్రభాకర్‌) మాట్లాడే కిలికిలి భాష అప్పట్లో ఓ హాట్‌ టాపిక్‌. ఇప్పటికీ ఈ భాష గురించి సరదాగా మాట్లాడేవారు ఉన్నారు. ఈ భాషను రచయిత మధన్‌ కార్కీ సృష్టించారు. ఈ భాషలో దాదాపు 700 పదాలు, 40 వ్యాకరణ నియమాలు ఉన్నాయట. ‘బాహుబలి’ సినిమాలోని మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఇరవై ఎకరాల విస్తీర్ణంలో, సుమారు రూ. 25 కోట్లతో ఏర్పాటు చేశారు. అలాగే ఈ సినిమాలోని గ్రాఫిక్స్‌ కోసం పదిహేనుకు పైగా స్టూడియోలు, ఐదొందల మందికి పైగా వీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్టులు శ్రమించాల్సి వచ్చిందట. ఇక కేకే సెంథిల్‌కుమార్‌ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, వి. శ్రీనివాస్‌మోహన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్,  కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. 

 దాదాపు రూ. 150 కోట్లకు పై బడ్జెట్‌తో రూపొందిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 600 కోట్ల వసూళ్లు సాధించి, 2015లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలాగే అప్పటికి అత్యధిక వసూళ్ళు సాధించిన రెండో భారతీయ చిత్రంగా రికార్ట్‌ సాధించింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్ళు రాబట్టిన తొలి పది తెలుగు చిత్రాల్లో ‘బాహుబలి: ది బిగినింగ్‌’ పేరు ఉంది.

తెలుగు సినిమా ‘గ్లోబల్‌ రేంజ్‌’కి ఎదిగింది ‘బాహుబలి’తోనే. ఒక రకంగా ‘పాన్‌ ఇండియా’ ట్రెండ్‌ ఆరంభమైనదే ‘బాహుబలి’తో అని చెప్పడం తెలుగువారు గర్వించే విషయం.

GvevgXpakAI73jH

రెండు భాగాలుగా అలరించిన బాహుబలి ఇప్పుడు ఒకే పార్ట్ గా మీ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ‘బాహుబలి: ది ఎపిక్ (Baahubali The Epic) పేరుతో ఇది రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని పోస్ట్ పెట్టారు. అది కూడా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఇది విడుదల కానుంది. దీంతో ఈ సినిమా మరోసారి చరిత్ర సృష్టించి.. రీ రిలీజ్ లో రికార్డు సొంతం చేసుకోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఈ స్పెషల్ సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ ‘బాహుబలి – ది ఎపిక్’ అనే కొత్త టైటిల్‌తో ఈ చిత్రాన్నికి సంబంధించి పోస్టర్ కూడా విడుదల చేశారు.

Advertisement

Latest News

సంతకం ఫోర్జరీ చేసి అధ్యక్షుడు అయ్యాడు.. సంతకం ఫోర్జరీ చేసి అధ్యక్షుడు అయ్యాడు..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు అరెస్ట్ క్లారిటీ ఇచ్చిన సీఐడీనకిలీ పత్రాలు సృష్టించి అధ్యక్ష పదవి పొందారని ఆరోపణలుమాజీ మంత్రి కృష్ణయాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు...
ఆదూరాన్ని తగ్గించింది... అడ్డుగోడను తొలగించింది..
ప్రభాకర్ రావు అరెస్ట్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్లిన సిట్
కల్తీ ఘటనపై స్పందించిన ఎక్సైజ్.. ఆ దుకాణాల లైసెన్స్ రద్దు..
మల్నాడు కిచెన్ డ్రగ్స్ పై ఈగల్ స్పెషల్ ఫోకస్
బెట్టింగ్ యాప్స్ బెండు తీసేందుకు రెడీ అయిన ఈడీ
పవన్ కళ్యాణ్ సవాల్.. నేను సిద్ధమన్న లోకేష్..!