వృద్ధాప్యంలో ఓ తోడు కావాలా.. మరి వీళ్లు మిమ్మల్ని కలిశారా

మీకు వయసు మీద పడిందా.. వృద్ధాప్యంలో ఓ తోడు కావాలని చూస్తున్నారా.. మళ్లీ పెళ్లి చేసుకుంటే పిల్లను ఎవరు ఇస్తారు అని ఆలోచిస్తున్నారా.. డోంట్ వర్రీ.. బీ హ్యాపీ.. మా దగ్గర ఓ సంబంధం ఉంది అంటూ ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళలు మీకు ఎప్పుడైనా కాల్ చేయడం.. కలవడం చేశారా.. అయితే కాస్త ఆగండి.. మహంకాళి పోలీసులను కలవండి మీకు వారి సమాచారం ఇట్టే తెలిసిపోతుంది.. వారు చేసే పెళ్లిళ్లు.. మ్యాచ్ ఫిక్సింగ్లు బయట పడతాయి. ఇదిగో ఆ వివరాలు మీకోసం.. పెళ్లిసంబంధాల పేరుతో వృద్ధులను మోసం చేస్తున్న ఇద్దరు మహిళలను మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది ఖమ్మం జిల్లా మధిర, జామలాపురానికి చెందిన ఇరుకుమాటి చిన కొండయ్యను పెళ్లి సంబంధాల పేరుతో రూ.1.77 లక్ష తీసుకొని మోసగించారు. కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన కటారు సరస్వతి (65)తో ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన కూనపరెడ్డి స్వాతి(40) లను అరెస్ట్ చేశారు. వృద్ధులైతే స్వాతి రంగంలోకి దిగుతోంది.. మా బంధువు అంటూ సరస్వతిని పరిచయం చేస్తుంది.. పెళ్లికి ఆమె రెడీ అని చెప్పి కొంత అడ్వాన్స్ తీసుకుంటుంది.. ఆ తరువాత జంప్ అవుతుంది. ఇక కాస్త 40ఏళ్ల వయసు పై బడిన వారి దగ్గర సరస్వతి ఎంట్రీ ఇస్తుంది.. స్వాతి రెడీ అని చెబుతూ ఇలా పెళ్లిళ్ల పేరుతో పంగనామలు పెట్టడం ఫ్యాషన్ అయిపోయింది. వయో వృద్ధులు కదా పెళ్లి, మోసం అని బయట చెబితే పరువు పోతుందని చాలా మంది ఈ కిలాడీ లేడీల గురించి ఫిర్యాదు చేయలేదు. మొత్తానికి ఖమ్మం వాసి చేసిన కంప్లైంట్ తో వీరి గుట్టు రట్టైంది. బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని మహంకాళి పోలీసులు కోరుతున్నారు.
Latest News
