పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్
By V KRISHNA
On
హైదరాబాద్: వనస్థలిపురంలో విషాదం అలుముకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని ఓ కుటుంబ సభ్యులు ఆసుపత్రిపాలైనారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో నివాసం వుండే శ్రీనివాస్ ఇంట్లో 8మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. వీరందరినీ చింతలకుంటలోని హిమాలయ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. బోనాల పండుగ సమయంలో తెచ్చుకున్న మాంసం చికెన్, బోటిని ఫ్రిజ్లో పెట్టుకొని ఈరోజు ఉదయం తిన్న తరువాత వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రజిత(38), జశ్విత(15), గౌరమ్మ(65), లహరి(17), సంతోష్ కుమార్(39), రాధిక(38), బేబీ కృతంగా (7) చికిత్స పొందుతున్నారు.
Latest News
22 Sep 2025 18:02:04
1704 ఇతర రాష్ట్రాల మద్యం సీజ్గడిచిన పదేళ్లలో ఈ సరే అధికం అని చెప్పిన అధికారులుసిటీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, జిల్లాలో నాటుసారా స్వాధీనం..మరో వారం...