తల్లికి పురుడు పోసిన 108 సిబ్బంది

On
తల్లికి పురుడు పోసిన 108 సిబ్బంది

కుత్బుల్లాపూర్. షాపూర్ నగర్ అర్ధరాత్రి పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలకు 108 సిబ్బంది పురుడు పోశారు . మహబూబ్ నగర్జిల్లాకు చెందిన సత్యమ్మ (23) నిండు గర్భవతి. రెండు రోజుల క్రితం అల్వాల్ లో ఉంటున్న తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో సత్యమ్మకు పురిటి నొప్పులు వస్తుండడంతో సహాయం కోసం 108 అంబులెన్స్ కాల్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది ఇంటికి చేరుకునే సమయంలో సత్యంమ్మకు పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడంతో సిబ్బంది ఇంటి వద్దనే పురుడు పోశారు. ఆడ పిల్లకు జన్మనిచ్చిన సత్యమ్మ ను షాపూర్ నగర్ ఆసుపత్రికి తరలించగా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న సత్యమ్మకు సరైన సమయంలో వైద్య సహాయం అందించిన అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి నరేందర్ రెడ్డి, పైలెట్ నవీన్ లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Latest News