రూ. 300కోట్ల ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం.. నిందితులపై నాన్ బెయిలబుల్ కేస్

బంజారా హిల్స్ నగరం నడిబొడ్డున రూ.300కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాచేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తూ పలుమార్లు నిబంధనలు ఉల్లం ఘిస్తున్న కబ్జాదారులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. షేక్పేట మండల పరిధిలోని సర్వే నెంబర్ 403/పీ లోకి వచ్చే టీఎస్ నెంబర్ 1/పి, బ్లాక్-హెచ్, వార్డు-10లో 5 ఎకరాల స్థలాన్ని కాజేసేందుకు బోగస్ పత్రాలను తయారు చేసిన పరు శరామ్ పార్థసారథి, అతడి కొడుకు విజయభార్గవ్ తదితరులు గత కొంతకాలంగా ప్రయత్ని స్తున్నారు. ఈ నేపథ్యంలో పార్ధసారథి మీద గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రెండు క్రిమినల్ కేసులు నమోదు కాగా జైలుకు వెళ్లి వచ్చాడు. ఫిబ్రవరిలో సైతం అతడి అనుచరులు సంబంధిత స్థలం లోపలికి ప్రవేశించి గది నిర్మించడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి స్థలం తమదేనంటూ దౌర్జన్యానికి దిగడంతో మరో కేసు నమోదైంది. ఇటీవల మరోసారి పార్థసారథితో పాటు అతడి అనుచరులు 5 ఎకరాల స్థలం బయట ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను తొలగించడం, లోపలివైపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ప్రైవేటు వ్యక్తులు నిఘా పెట్టిన వ్యవహారంపై
షేక్పేట్ మండల తహస ల్దార్ అనితారెడ్డి స్పందించారు. ఈనెల 16న రెవెన్యూ సిబ్బంది స్థలం వద్దకు చేరుకుని ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసైనా వాటిని తొలగించారు. రూ.300కోట్ల విలువైన స్థలాన్ని తమ స్థలంగా చూపిస్తూ జనాన్ని మోసం చేసేందుకు యత్ని స్తున్నారని షేక్పేట తహసీల్దార్ అనితారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు పార్థసారథి, విజయ్ తో పాటు స్థలంలోకి ప్రవేశిస్తున్న అనుచరులపై బీఎన్ 25 329(3), 111(4), 221,352, 322, 324(2), 62 రెడ్విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రభుత్వస్థలాన్ని కాజేసేందుకు ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్న నిందితులపై ఆర్గనైజ్డ్ క్రైంగా బీఎన్ఎస్ 111 (4) సెక్షన్ నమోదు చేయడం విశేషం.
Latest News
