మరోసారి రికార్డ్ బద్దలు కొట్టిన సైబరాబాద్ పోలీసులు

On
మరోసారి రికార్డ్ బద్దలు కొట్టిన సైబరాబాద్ పోలీసులు

సైబరాబాద్ క్రైమ్ పోలీసులు మరోసారి రికార్డ్ బద్దలు కొట్టారు. రూ. 2 కోట్ల విలువైన 827 ఫోన్‌లు స్వాధీనం చేసుకుని  పోగొట్టుకున్న సెల్ ఫోన్‌లను తిరిగి వాటి యజమానులకు అందించడంలో మరోసారి తమ నిబద్ధతను చాటుకున్నారు. సైబరాబాద్ క్రైమ్ డీసీపీ ఉత్తమ్ రెడ్డి నేతృత్వంలో సీఈఐఆర్ (CEIR - Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా జరిపిన ఎనిమిదో విడత ఆపరేషన్‌లో భాగంగా 827 సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకుని, వాటి యజమానులకు అందజేశారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని అంచనా.
డీసీపీ ముత్యం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు మొత్తం 11,000 ఫోన్‌లను గుర్తించి బాధితులకు అందజేశామన్నారు. మాదాపూర్, బాలానగర్, మేడ్చల్, శంషాబాద్, షాద్‌నగర్ సీసీఎస్ (CCS - Cyber Crime Station) పరిధిలోని బాధితులకు ఈ సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఫోన్‌లను తిరిగి ఇచ్చారు.

Advertisement

Latest News