ఒరిస్సా టు హైదరాబాద్ గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్..
ఒరిస్సా టూ హైదరాబాద్ గంజాయి రవాణ అవుతున్న విషయం తెలుసుకున్న ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ టీమ్‌లు మాటు వేసి పట్టుకున్న 8.6 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తుల అరెస్టు చేశారు.
డేలైట్ సాప్టవేర్ కంపెనీలో సెక్యూరిటి గార్డు ఉద్యోగం చేస్తూ కంపెనీ ఉద్యోగులకు గంజాయి అమ్మకాలు ప్రవృత్తిగా కొనసాగిస్తున్న అంజనీ దూబే అనే వ్యక్తిని, ఒరిస్సాకు చెందిన శంకర్ దాస్ ఒరిస్సా నుండి గంజాయి తెచ్చి వ్యాపారంగా మార్చుకున్నారు.
బీహార్ రాష్ట్రాని చెందిన అంజనీ దూబే సాఫ్ట్వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఒరిస్సా మల్కాన్‌గిరిజిల్లాకు చెందిన శంకర్‌దాస్‌తో పరిచయం ఏర్పడిన తరువాత ఈ బిజినెస్ మొదలు పెట్టారు. గంజాయి కోసం భద్రాచలం ప్రాంతానికి అంజనీ దాస్ వెళ్లి తాను వచ్చినట్లు సమాచారం ఇస్తాడు. మల్కాన్‌గిరిజిల్లా నుంచి శంకర్ దాస్ బైక్‌పై గంజాయిని తీసుక వచ్చి సెక్యూరిటీ గార్డును గంజాయిని హైదరాబాద్‌లో బైక్‌పై తీసుకు వచ్చి దింపి తనకు రావాల్సిన డబ్బులను తీసుకొని వెళ్తాడు.
వీరిద్దరి గంజాయి రాకెట్‌ను చేధించడానికి స్టేట్ టాస్క్‌ఫొర్స్ సీ అండ్ డీ టీమ్‌ల సీఐలు వెంకటేశ్వర్లు, నాగరాజులు సిబ్బంది కలిసి స్థానిక ఎక్సైజ్ సిబ్బంది సహకారం తీసుకొని భద్రాచలం కూనవరం రోడ్డు ఆర్టీఓ చెక్‌పోస్టు వద్ద గంజాయితో బైక్ వస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద ఉన్న 8.6 కేజీల గంజాయితోపాటు రెండు సెల్ ఫోన్లను, గంజాయి రవాణకు వినియోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకొని భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు సీఐలు తెలిపారు.