సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ
కుత్బుల్లాపూర్, జులై 24. దూలపల్లి లోని మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సంకల్ప్ ఫౌండేషన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సతీష్ సాగర్ ఆధ్వర్యంలో షూ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెట్ బషీరాబాద్ సీఐ విజయ వర్ధన్ మరియు ఎస్ఐ ధర్మేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ వర్ధన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా బూట్లు పంపిణీ చేస్తున్న సంకల్ప్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ సభ్యులను వారు అభినందిస్తూ, ప్రజలందరూ సామాజిక స్పృహతో సేవ కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, సంకల్ప్ ఫౌండేషన్ సభ్యులు శివాజీ రాజ్ , శ్రీకాంత్, మహేందర్ సాగర్, పాఠశాల ఉపాధ్యాయులు జయమాల మరియు కవిత, స్థానిక నాయకులు నర్సింహ, దుర్గా అశోక్, మధు, నర్సింగ్ రావు, మహేష్, భజరంగ్ దళ్ సభ్యులు అరుణ్, రవీందర్, శశికాంత్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.