టాలీవుడ్ లో విషాదం: ఫిష్ వెంకట్ కన్నుమూత

By TVK
On
టాలీవుడ్ లో విషాదం: ఫిష్ వెంకట్ కన్నుమూత

హాస్య నటుడు ఫిష్ వెంకట్ ఇక లేరు
కిడ్నీ, లివర్ సమస్యలతో పోరాడిన వెంకట్
జంతర్ మంతర్ మూవీలో సినిమాల్లో అవకాశం
తెలంగాణ యాసతో ఆకట్టుకున్న వెంకట్

హాస్య నటుడు ఫిష్‌ వెంకట్‌ అలియాస్ వెంకటేష్ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్రమైన కిడ్నీ, లివర్ సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొన్ని నెలలుగా డయాలసిస్ చేయించుకుంటున్న ఫిష్ వెంకట్ ను ఇటీవల పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తూ వచ్చారు. రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పారని ఇటీవల ఆయన కూతురు తెలిపారు. దాతలు సాయం చేయాలని ఆమె కోరారు. పవన్ కల్యాణ్, విశ్వక్ సేన్ వంటి నటులు సహాయం అందించారు. అయితే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కోసం డోనర్ దొరకకపోవడంతో ఆయన పరిస్థితి మరింత దిగజారి మరణించారు. 

మచిలీపట్నానికి చెందిన ఫిష్ వెంకట్‌ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. చేపల వ్యాపారిగా ఉన్న వెంకట్‌కు 1989లో తన స్నేహితుడి ద్వారా దివంగత నిర్మాత మాగంటి గోపినాథ్‌ పరిచయం అయ్యారు. 1991లో నిర్మించిన జంతర్‌ మంతర్‌ మూవీలో వెంకట్‌ తొలిసారి నటించారు. మొదట్లో పెద్దగా గుర్తింపు రాకపోయిప్పటికీ నటనపై ఆసక్తితో పలు సినిమాల్లో నటించారు. నటుడిగా మారాక పేరు ఫిష్ వెంకట్‌గా పిలవడం మొదలు పెట్టారు. అనంతరం ఫిష్ వెంకట్ తెలంగాణ యాసతో హాస్య పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. గబ్బర్ సింగ్, అదుర్స్, డీజే టిల్లు వంటి చిత్రాల్లో నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ విలన్ గా ఫిష్ వెంకట్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. విలన్ గ్యాంగ్ లో ఉంటూనే తనదైన స్టైల్లో కామెడీని పండిస్తూ ప్రేక్షకులను నవ్వించారు. ముఖ్యంగా వీవీ వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'ఆది' సినిమాలో "తొడకొట్టు చిన్నా" అనే డైలాగ్ తో  మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత నుంచి వరుస ఆఫర్లతో టాప్ హీరోలందరి సినిమాల్లో నటించారు. బన్నీ, రెడీ, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్.. సహా ఎన్నో చిత్రాల్లో కనిపించారు. 

Advertisement

Latest News

కాంగ్రెస్ నీ వ్యక్తిగత సామ్రాజ్యమా? సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్ కాంగ్రెస్ నీ వ్యక్తిగత సామ్రాజ్యమా? సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్
రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో కలకలం 2034 వరకు సీఎం అన్న రేవంత్ పై కోమటిరెడ్డి ఫైర్ రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకం
సిట్ విచారణకు మిథున్ రెడ్డి.. అరెస్ట్ ఖాయమేనా?
గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీగా అమరావతి.. రూ.51 వేల కోట్ల ఒప్పందాలు
టాలీవుడ్ లో విషాదం: ఫిష్ వెంకట్ కన్నుమూత
దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..!
వేల ఎన్ కౌంటర్లు..వందల మంది హతం..తప్పు చేస్తే అక్కడంతే!
మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్.. మద్యం కేసులో అరెస్టుకు రంగం సిద్ధం!