ఓపెన్ జిమ్ లో ఇనుపరాడ్డు మీదపడి బాలుడి మృతి
By Ravi
On

ఓపెన్ జిమ్ పార్కులో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఇనుపరాడ్డు మీద పడి ఐదు సంవత్సరాల బాలుడు మృతి చెందిన సంఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జిల్లెల్లగూడ దాసరి నారాయణరావు కాలనీలో నివాసముండే
ప్రసాద్, వాణీలకు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు. రోజు మాదిరిగానే ఇంటి పక్కనే ఉన్న మంత్రాల చెరువు కట్టపై కాలనీకి చెందిన స్నేహితులతో కలిసి నిఖిల్ ఆడుకుంటుండగా ఇనుపరాడు ప్రమాదవశాత్తు మీద పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు దృవీకరించినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News

10 Aug 2025 18:00:13
పార్కింగ్ కష్టాలు తీర్చే దిశగా అడుగులు..ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ వ్యవస్థ సిద్ధం..నాంపల్లిలో 1st పేజ్ సిద్ధం చేసిన అధికారులు..