మూసీ పరివాహక ప్రాంతాలకు రెడ్ అలర్ట్..

On
మూసీ పరివాహక ప్రాంతాలకు రెడ్ అలర్ట్..

  • హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు క్లోజ్ చేసిన జలమండలి అధికారులు..
  • మూడు గేట్లు తెరిచి నీటిని వదిలిన అధికారులు

రంగారెడ్డిజిల్లా  హిమాయత్ సాగర్ ORR సర్వీస్ రోడ్డును మూసివేశారు. రాజేంద్రనగర్ నుంచి హిమాయత్ సాగర్ వైపు సర్వీస్ రోడ్డు పై రాకపోకలను పోలీసులు నిలిలివేశారు. ఎగువ ప్రాంతాల నుండి విఫరీతమైన వరద నీరు పోటెత్తడంతో సర్వీస్ రోడ్డు బ్రిడ్జిపై నుంచి భారీగా వరద నీరు వెళ్తుండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేసి  4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు జలమండలి అధికారులు వదిలేశారు.   2గేట్లు ఒక అడుగు , 2 గేట్లు 2 అడుగుల మేర పైకెత్తి దిగువకు నీటిని వదిలారు.  సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుత స్థాయి నీటిమట్టం 1763 అడుగులు చేరుకుంది. దీంతో
300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కాగా 2070 క్యూసెక్కుల ఔట్ ఫ్లో పెరిగింది. గేట్లు ఎత్తివేయడంతో ఉదృతంగా మూసీ నది ప్రవాహం పెరగడంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Latest News