మీర్పేట్ లో శ్రీ గాయత్రీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు
By V KRISHNA
On
పవిత్ర జంధ్యాల..శ్రావణ పౌర్ణమి సందర్భంగా మీర్ పేటలోని శ్రీ గాయత్రీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, సామూహిక నూతన యజ్ఞోపవీత ధారణ, దేవ ఋషి పితృ తర్పణములు అనంతరము నూతన వతువులకు ఉపాకర్మ, ముంజివిడుపు, కాండఋషి హోమాది కార్యక్రమములు జరిపారు. అనంతరం శ్రావణమాస నిత్య కుంకుమార్చన లో భాగంగా సువాసినులచే సహస్రనామ కుంకుమార్చన, తదనంతరం శ్రీ గౌరీ నీలకంఠేశ్వర సమేత లక్ష్మీ గణపతి దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు
. ఈ కార్యక్రమంలో అశేషంగా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాల స్వీకరించారు.
Related Posts
Latest News
13 Nov 2025 11:41:47
పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం..
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తీసుకున్న సైలెంట్.. కానీ స్ట్రాంగ్ రాజకీయ స్ట్రాటజీపై లోతైన విశ్లేషణ.

.jpeg)