ఇది విన్నారా.. ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే..

On
ఇది విన్నారా.. ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే..

  • భారత్ గౌరవ్ పేరుతో పర్యాటక టూర్ స్టార్ట్ చేసిన రైల్వే..
    తక్కువ ధరకు జ్యోతిర్లింగాల దర్శనం..
    స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని వారే చూసుకుంటారు..

By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
తీర్థయాత్రలు.. మాట వినగానే అందరికి మనస్సుల్లో అబ్బా వెళ్తే బాగుండు అని ఖచ్చితంగా వినిపిస్తుంది. కానీ ఎలా వెళ్లాలి.. ఎక్కడ ఉండాలి.. అక్కడ సౌకర్యవంతంగా ఉంటుందా.. ఇబ్బందులు వస్తాయా.. దర్శనాలు సరిగా అవుతాయా.. ఇవే సందేహాలు మనల్ని కలిచివేస్తాయి. పోని ప్రైవేట్ వాహనాల టూర్ ప్యాకేజ్ చూస్తే ధరలకు కళ్లు బైర్లు కమ్ముతాయి.. హమ్మ అంత ధరా వద్దులే ఇంట్లో నుండే స్వామికి నమస్కరిస్తే సరిపోతుంది అనుకునే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి కోసమే సౌత్ సెంట్రల్ రైల్వే (South Central railway) ఓ ప్రకటన చేసింది.  దాని పేరే 🌟 భారత్ గౌరవ్” ప్రత్యేక పర్యాటక రైలు 🌟 ఇది ఏంటి.. ఎమ్ చేస్తారు.. ఇలా తీసుకు పోతారు ఆ వివరాలు ట్రూ పాయింట్ న్యూస్ లో మీ కోసం..
ఆగస్టు 16, 2025 న ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక పర్యాటక రైలు  సికింద్రాబాద్ రైల్వే స్టేషIMG-20250805-WA0058న్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు ద్వారా మీరు  పంచ (5) జ్యోతిర్లింగ దర్శన యాత్ర (8 రాత్రులు / 9 రోజులు) చేయవచ్చు.
దర్శన ప్రదేశాలు:
1. మహాకాళేశ్వర్
2. ఓంకారేశ్వర్
3. త్రయంబకేశ్వర్
4. భీమశంకర్
5. గృష్ణేశ్వర్
రైలు బయలుదేరు సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు సికింద్రాబాద్  నుంచి  , కామారెడ్డి , నిజామాబాద్, ధర్మాబాద్, ముద్కేడ్, నాందేడ్, పూర్ణా మీదుగ ఉజ్జయినికి ప్రయాణం కొనసాగుతుంది.
 ప్రతి ఒక్కరికీ టికెట్ ధరలు:
SL: ₹14,700/-
3 AC: ₹22,900/-
2 AC: ₹29,900/-
ప్యాకేజీలో రోజుకు మూడు భోజనాలు,  వసతి,  పర్యాటక రవాణా సౌకర్యాలు, మరియు ప్రతి బోగీలో   IRCTC సిబ్బంది అందుబాటులో ఉంటారు. వారు దగ్గరుండి మీకు దర్శనాలు  చేయిస్తారు. ట్రైన్ దిగిన వెంటనే వారి వాహణల్లోనే దేవాలయాలకు తీసుకు పోతారు. మంచి గదులు, చక్కటి భోజనం అందిస్తారు. యాత్ర పూర్తి కాగానే మిమ్మలి ఎంత జాగ్రత్తగా తీసుకు వెళ్తారో అంతే జాగ్రత్తగా దింపుతారు. ఈ అవకాశం తప్పకుండా వినియోగించుకోవాలి అని IRCTC భావిస్తుంది. ఏంటి ఇంకా నమ్మక పోతే 
మరింత సమాచారం కోసం:
🌐 వెబ్‌సైట్: www.irctctourism.com
📞 ఫోన్ నంబర్లు: 97013 60701, 92810 30740, 92810 30750, 92810 30711 కాల్ చేయండి.. మేము చెప్పేది అక్షరాల నిజం అని మీకే తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం హాయిగా ప్రయాణం చేయండి. స్వామివారి దర్శనం చేసుకోండి.

Advertisement

Latest News

ఇది విన్నారా.. ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే.. ఇది విన్నారా.. ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే..
భారత్ గౌరవ్ పేరుతో పర్యాటక టూర్ స్టార్ట్ చేసిన రైల్వే..తక్కువ ధరకు జ్యోతిర్లింగాల దర్శనం..స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని వారే చూసుకుంటారు..
ఇక అదిరిపోనున్న హైదరాబాద్..
సంపూర్ణ రియల్ మార్గదర్శి ఈ పుస్తకం
ఇక తాగే వాళ్లకు.. తాగినంత బీర్లు..
అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం
స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్..
ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..