రుద్రారంలో తోషిబా అధునాతన తయారీ కేంద్రం ప్రారంభం

On
రుద్రారంలో తోషిబా అధునాతన తయారీ కేంద్రం ప్రారంభం

  • కొత్తగా సీఆర్‌జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్, సర్జ్ అరెస్టర్ లైన్ ప్రారంభం
    - ఈహెచ్‌వీ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ప్లాంట్ విస్తరణకు శంకుస్థాపన
    - రూ. 562 కోట్ల పెట్టుబడిలో భాగంగా కొత్త తయారీ లైన్లు

సంగారెడ్డిIMG-20250808-WA0064 జిల్లా రుద్రారంలో ఉన్న తోషిబా ట్రాన్స్‌మిషన్,డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ లో కొత్తగా నిర్మించిన సీఆర్‌జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్, సర్జ్ అరెస్టర్ లైన్‌ను తెలంగాణ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు,వాణిజ్యం,శాసనసభ వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు ప్రారంభించారు. దాంతో పాటు టీటీడీఐ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ లైన్ విస్తరణకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ వ్యూహాత్మక చర్య భారత్‌ను తయారీ కేంద్రంగా, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార ఎగుమతుల కేంద్రంగా మార్చాలనే తోషిబా దీర్ఘకాలిక నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. కొత్తగా ప్రారంభించిన రుద్రారం కేంద్రంలో ఏటా 12,000 మెట్రిక్ టన్నుల కోల్డ్ రోల్డ్ గ్రైన్-ఓరియెంటెడ్ స్టీల్‌ను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉన్న సీఆర్‌జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంది. అలాగే ఏటా 80,000 యూనిట్లను తయారు చేసేందుకు రూపొందించిన సర్జ్ అరెస్టర్ ఉత్పత్తి లైన్ కూడా ఉంది. ఈహెచ్‌వీ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ విస్తరణ ప్రాజెక్టు పూర్తయితే, టీటీడీఐ మొత్తం పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ఉత్పత్తి సామర్థ్యం ఏటా 30000 ఎంవీఏ నుండి 42000 ఎంవీఏకి పెరుగుతుంది. ఈ అదనపు సదుపాయాలు భారతదేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా టీటీడీఐకి చెందిన దేశీయ, ప్రపంచ సరఫరా సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి.

టీటీడీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి ఫురుటా మాట్లాడుతూ.. “మంత్రి శ్రీధర్ బాబు నూతన కేంద్రాన్ని ప్రారంభించి, మా విస్తరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం మాకు ఎంతో గౌరవం. ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు సంతోషం. భారత్‌లో తోషిబా తయారీ రంగాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మేము పెట్టుబడులు పెడుతున్నాం. ఈ పెట్టుబడులు స్థానికంగా ఉద్యోగాలను సృష్టించడంతో పాటు, నైపుణ్యాల అభివృద్ధికి కూడా తోడ్పడతాయి. మా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడానికి, పనితీరును మెరుగుపరచుకోవడానికి, ఉత్పత్తులను వేగంగా మార్కెట్‌లోకి తీసుకురావడానికి, భారత్‌తో సహా ప్రపంచానికి నాణ్యమైన, సుస్థిరమైన ఇంధన పరిష్కారాలను అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము”అని పేర్కొన్నారు. 
ఈ కార్యక్రమానికి కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు,గనులు, భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి జి. వివేక్ వెంకట్ స్వామి, పటాన్‌చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మహిపాల్ రెడ్డి,సమాచార సాంకేతికపరిజ్ఞానం,ఎలక్ట్రానిక్స్,
కమ్యూనికేషన్స్,పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. ఈ ఏడాది మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ రాజధాని టోక్యో పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయనతో పాటు పరిశ్రమలు,ఐటీ, క్రీడా శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్,పెట్టుబడుల ప్రోత్సాహం విభాగం స్పెషల్ సెక్రటరీ ఎమ్మాది విష్ణు వర్ధన్ రెడ్డి ఉన్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి టీటీడీఐతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.దీని ప్రకారం, రూ.562 కోట్లు (జపాన్ కరెన్సీ యెన్‌ - 10 బిలియన్లు) పెట్టుబడితో తోషిబా, తెలంగాణలో తమ తయారీ సామర్థ్యాన్ని విస్తరించనుంది. దీంతో 2024 ఆర్థిక సంవత్సరం నుంచి మూడేళ్లలో కొత్తగా 250కి పైగా ఉద్యోగాలు వస్తాయి.పరిసర ప్రాంతాలు సామాజికంగా,ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతాయి.
నాణ్యత,నూతన ఆవిష్కరణలు, సుస్థిరత అనే అంశాలపై ప్రధాన దృష్టితో,టీటీడీఐ దేశంలో తయారైన ట్రాన్స్‌ఫార్మర్‌లను 50కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది.దీని ద్వారా తోషిబా..టీ అండ్ డీ పరికరాల కోసం ఒక అంతర్జాతీయ కేంద్రంగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.టీటీడీఐ రెండు ముఖ్యమైన లక్ష్యాల కోసం కృషి చేస్తోంది. మొదటిది, ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు సహకరించడం.కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలనే గ్లోబల్ లక్ష్యంలో తాము కూడా భాగస్వామ్యం కావాలనే విషయంలో కట్టుబడి ఉండటం. రెండవది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యుత్ కంపెనీలు, ఇతర తయారీదారుల కోసం మరింత పటిష్టమైన సామాజిక మౌలిక సదుపాయాలను నిర్మించడానికి తోడ్పడటం.ఈ రెండు లక్ష్యాల ద్వారా,టీటీడీఐ పర్యావరణ పరిరక్షణకు,మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Latest News

నగరంలో ఊపందుకున్న రాఖీ విక్రయాలు నగరంలో ఊపందుకున్న రాఖీ విక్రయాలు
తెలంగాణ ప్రాంతంలో రాఖీ విక్రయాలు ఊపందుకున్నాయి. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగతో ఎక్కడ చూసినా షాపులన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. వివిధ రంగులతో షాపులన్ని...
రుద్రారంలో తోషిబా అధునాతన తయారీ కేంద్రం ప్రారంభం
ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో విద్యా ప్రేరణ
ఇది విన్నారా.. ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే..
ఇక అదిరిపోనున్న హైదరాబాద్..
సంపూర్ణ రియల్ మార్గదర్శి ఈ పుస్తకం
ఇక తాగే వాళ్లకు.. తాగినంత బీర్లు..