జూలో ఘనంగా సింహాల దినోత్సవం..

On
జూలో ఘనంగా సింహాల దినోత్సవం..

హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ప్రపంచ సింహ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంలగా ఆసియాటిక్ మరియు ఆఫ్రికన్ సింహాల ఎంక్లోజర్‌ల వద్ద పిల్లలకు పజిల్స్, క్రాస్‌వర్డ్, “ఫైండ్ ద వర్డ్” వంటి పోటీలను నిర్వహించారు. మొత్తం 374 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అదనంగా, సింహాల ప్రవర్తన, ఆయుష్షు, ఇతర ముఖ్యమైన అంశాల గురించి జంతు సంరక్షకులు వివరించిన ఇన్ఫర్మేటివ్ టాక్ షో నిర్వహించబడింది.. ఎం. దీపక్ తరుణ్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో సందర్శకుల నుండి మంచి స్పందన పవచ్చింది. సందర్శకులు సింహాల సంరక్షకులతో ప్రత్యక్షంగా మట్లాడి తమ ఇష్టమైన జంతువు గురించి తెలుసుకునే అవకాశం పొందారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి. శ్రీనివాస్, అసిస్టెంట్ డైరెక్టర్ (వెటర్నరీ), జూలో సింహాల ఆరోగ్య సంరక్షణ, ఇతర జంతువుల ఆరోగ్య పరిస్థితి, టీకాల ప్రాధాన్యం గురించి వివరించారు. శ్రీమతి నాజియా తబస్సుం, AC-1, సింహ దినోత్సవం జరుపుకోవాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తూ సందర్శకులతో మట్లాడారు. శ్రీ బి. లక్ష్మణ్, AC-3, హైదరాబాదు జూలో స్వచ్ఛమైన జాతి (Pure Breed) ఆసియాటిక్ సింహాలను ఉంచి ఉన్నామన్న గర్వాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో స్వచ్ఛమైన జాతి ఆసియాటిక్ సింహాలను ఉంచి ఉన్న ఏకైక జూ హైదరాబాద్ జూ అని తెలిపారు. అలాగే, జూ ఆసియాటిక్ సింహాల విజయవంతమైన పెంపకం చేస్తున్నదని, ప్రపంచవ్యాప్తంగా జంతువుల మార్పిడి కార్యక్రమాలలో వీటికి అధిక ప్రాధాన్యం ఉందని చెప్పారు.IMG-20250810-WA0023

Related Posts

Advertisement

Latest News

పట్టించుకోనట్లే ఉంటూ అన్నీ పట్టించుకుంటున్నాడు – పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం.. పట్టించుకోనట్లే ఉంటూ అన్నీ పట్టించుకుంటున్నాడు – పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం..
పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తీసుకున్న సైలెంట్.. కానీ స్ట్రాంగ్ రాజకీయ స్ట్రాటజీపై లోతైన విశ్లేషణ.
మింగేసింది అంతా..కక్కించిన హైడ్రా..
కంటెంట్ తో కోట్లు కొట్టేశారు.. హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు..
మూసీలో ఆదిత్య అక్రమ నిర్మాణం.. హైడ్రాకు పట్టని వైనం..
ఎటు చూసినా మూసీ ప్రవాహం.. హైదరాబాద్ అల్లకల్లోలం..
వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు
దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.