ఆపరేషన్‌ సిందూర్‌.. ప్రపంచ నేతల రియాక్షన్ ఇదే..

By Ravi
On
ఆపరేషన్‌ సిందూర్‌.. ప్రపంచ నేతల రియాక్షన్ ఇదే..

ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాకిస్థాన్‌ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పహల్గాం ఘటనకు ప్రతీకార చర్య చేపట్టింది. ఇందులో భాగంగా గత అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్‌ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. దీనిపై ప్రపంచ నేతలు స్పందిస్తున్నారు. ఇరుదేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సూచించారు. ఈ దాడులు త్వరగా ముగిసిపోవాలని ఆశాభావం వ్యక్తంచేశారు. మరోవైపు భారత సైనిక చర్యల గురించి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబాల్ అమెరికా సలహాదారు మార్క్‌ రూబియోతో మాట్లాడారు. దీనికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి. రెండు శక్తిమంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరు. భారత్‌, పాక్‌లకు ఎంతో చరిత్ర ఉంది. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి శాంతి కావాలి. ఘర్షణలు వద్దు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రియాక్ట్ అయ్యారు.

భారత్‌, పాక్‌ రెండూ చైనాకు పొరుగు దేశాలే. చైనా అన్నిరకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది. శాంతి, స్థిరత్వంతో భవిష్యత్తు ప్రయోజనాల కోసం వ్యవహరించాలని ఇరు దేశాలను కోరుతున్నాం. ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలి. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను దూరంగా ఉండాలని భారత్‌, పాకిస్థాన్‌లను కోరుతున్నాం అని చైనా స్పందించింది. ఆత్మ రక్షణ కోసం భారత్‌ దాడి చేస్తోంది. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి. భారత్‌ కు మా మద్దతు ఉంటుంది భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్‌ అజార్‌ అన్నారు.

Advertisement

Latest News

ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్ ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ...
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం
అదరగొట్టిన ఆపరేషన్ అభ్యాస్