ప్రధాని మోడీని, భారత్ ను నాశనం చేస్తా: మసూద్

By Ravi
On
ప్రధాని మోడీని, భారత్ ను నాశనం చేస్తా: మసూద్

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిపై భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బహావల్ పూర్ స్థావరం పూర్తిగా నాశనమైంది. ఆపరేషన్ సింధూర్ తో జైషే మహమ్మద్ స్థావరం నామరూపల్లేకుండా పోయింది. దీంతో మసూద్ అజహర్ కుటుంబంలో దాదాపు 14 మంది మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో జైషే చీఫ్ మసూద్ అజహర్ సోదరి, బావ, మేనల్లుడు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ దాడి జరిగిన తర్వాత జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఓ లెటర్ ను రిలీజ్ చేశారు. 

ఇక, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విషం కక్కుతూ ఓ లేఖను మసూద్ విడుదల చేశారు. ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ నియామాలు ఉల్లంఘించారు అని తీవ్రంగా మండిపడ్డారు. నాకు భయం లేదు, నిరాశ లేదు, విచారం లేదంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. అయితే, ప్రధాని మోడీని, భారతదేశాన్ని నాశనం చేస్తానంటూ హెచ్చరించారు. భారత్ పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తానంటూ మసూద్ అజహర్ లేఖలో ప్రస్తావించారు. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ సంచలనం రేపింది.

Advertisement

Latest News

ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్ ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ...
లోప రహిత క్రమశిక్షణ.. అప్పీల్ కేసుల నిర్వహణపై సదస్సు
నార్సింగిలో విషాదం.. అగ్నిప్రమాదంలో కొరియోగ్రాఫర్ మృతి
55ఏళ్ల తరువాత వార్ సైరన్లు వాడాము.. సీపీ ఆనంద్
జవహర్ నగర్ లో విషాదం.. లిఫ్ట్ తెగిపడి ముగ్గురు మృతి
పేరుకి కార్ల వ్యాపారం.. చేసేది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విక్రయం
అదరగొట్టిన ఆపరేషన్ అభ్యాస్