ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన

ప్రమాదంలో గాయపడిన దంపతులకు తక్షణ సహాయం

On
ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన

తిరుపతి జిల్లా, జూన్ 7: సూళ్లూరుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వాన్ని చాటుకున్న ఉదంతం నాయుడుపేట వద్ద చోటుచేసుకుంది.

గూడూరు నియోజకవర్గానికి చెందిన భూధనం గ్రామానికి చెందిన ఓ దంపతులు కాళహస్తి దర్శించుకుని తిరిగి వస్తుండగా, నాయుడుపేట మండలం విన్నమాల జాతీయ రహదారి వద్ద వారి బైకు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి.

అదే సమయంలో సూళ్లూరుపేటకు వెళ్తున్న ఎమ్మెల్యే విజయ్ శ్రీ గారు ఈ సంఘటనను గమనించి తక్షణమే తన కాన్వాయ్‌ను ఆపి, క్షతగాత్రులను పరిశీలించారు. వెంటనే పోలీసు అధికారి డిఎస్పీ చెంచుబాబు వాహనంలో గాయపడిన దంపతులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు.

ఆసుపత్రికి చేరుకున్న అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడి, మెరుగైన చికిత్స అందేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఘటనలో ఎమ్మెల్యే గారు చూపిన వేగవంతమైన స్పందన, మానవతా విలువల పట్ల ఆమె నిబద్ధత ప్రజల ప్రశంసలతో చర్చనీయాంశంగా మారింది. ప్రజా ప్రతినిధిగా ఆమె ప్రవర్తన అనేకరికి ఆదర్శంగా నిలుస్తోంది.

Advertisement

Latest News

ఆదాయం కోసం అడ్డదారులు.. గర్భం పేరుతో గలీజ్ పనులు ఆదాయం కోసం అడ్డదారులు.. గర్భం పేరుతో గలీజ్ పనులు
టెస్ట్ ట్యూబ్ బేబీ పేరుతో మోసాలు..భర్తకు బదులు మరొకరి వీర్యంతో జీవితాలు ఆగం చేసిన నిర్వాహకులు..దేశవ్యాప్తంగా బ్రాంచ్ లు..సికింద్రాబాద్ లో వెలుగు చూసిన యూనివర్సల్ మోసాలు..
వీకెండ్ పార్టీ అంటూ పరుగులు పెట్టారు..చివరకు బోర్లా పడ్డారు..
భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు
శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు డిఎస్పీల మృతి..
హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు