శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..
By V KRISHNA
On
కుత్బుల్లాపూర్: దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధి బౌరంపేట్ శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ బిమినేని శ్రీకాంత్ పై కేసు నమోదైంది. విద్యార్థుల నుండి వసూలు చేసిన ఫీజులను యాజమాన్యానికి చెల్లించకుండా తన బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నాడు. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కళాశాలకు వెళ్లడంతో ఫీజులు బకాయి ఉన్నాయని యాజమాన్యం తెలిపింది. దీనితో ఖంగుతిన్న స్టూడెంట్స్ దాదాపు 40 మంది విద్యార్థులు చెల్లించామని తెలిపారు. కళాశాల యాజమాన్యం దీంతో విచారణ జరిపి శ్రీకాంత్ 30 లక్షల రూపాయలు వాడుకున్నట్లు తేల్చారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Related Posts
Latest News
26 Jul 2025 10:29:52
హైదరాబాద్: సికింద్రాబాద్.. రాంగోపాల్ పేట.. మెక్లవుడ్ గూడలో శిధిలావస్థకు చేరుకున్న ఒక పురాతన భవనాన్ని జిహెచ్ఎంసి అధికారులు పోలీసుల సహాయంతో కూల్చివేశారు. అయితే ఈ భవనంలో గత...