ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు డిఎస్పీల మృతి..
- మరో ఇద్దరి పరిస్థితి విషయం..
- గాయపడిన వారిని కామినేని ఆస్పత్రికి తరలింపు..
- రోడ్డుప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
హైదరాబాద్ పరిధి చౌటుప్పల్ మండలం కౌతాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. యాదాద్రి భువనగిరి పరిధి చౌటుప్పల్ మండలం కౌతాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీకి చెందిన డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావు, అడిషనల్ ఎస్పీ ప్రసాద్ తదితరులు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో డీఎస్పీలు చక్రధర్‌రావు, శాంతారావు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నర్సింగ్‌రావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చనిపోయిన డీఎస్పీలు ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసుల వాహనం డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపునకు వెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు.