ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు

On
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు

  • సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి..
  • కాంగ్రెస్ పార్టీ నేతలు ముట్టడి చేస్తారని సమాచారం..
  • కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు..
  • ముందస్తు జాగ్రత్తగా బందోబస్తు

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేశాయి. ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఎన్‌ఎస్‌యూఐ (NSUI) కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసే అవకాశం ఉందనే సమాచారంతో కొండాపూర్‌లోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని పసిగట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేకు మద్దతుగా, కాంగ్రెస్ శ్రేణుల దాడిని అడ్డుకునేందుకు వారు మోహరించారు. కౌశిక్ రెడ్డి నివాస పరిసరాల్లో పోలీసులు అదనపు బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Latest News

భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు.. భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు..
హైదరాబాద్: సికింద్రాబాద్.. రాంగోపాల్ పేట.. మెక్లవుడ్ గూడలో శిధిలావస్థకు చేరుకున్న ఒక పురాతన భవనాన్ని జిహెచ్ఎంసి అధికారులు పోలీసుల సహాయంతో కూల్చివేశారు. అయితే ఈ భవనంలో గత...
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు
శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు డిఎస్పీల మృతి..
హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ