హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్‌..!

By Ravi
On
హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్‌..!

హెచ్‌సీయూలో చెట్ల నరికివేత వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 100 ఎకరాల్లో చెట్లను పునరుద్ధరణ చేయాలని.. లేకపోతే చీఫ్ సెక్రటరీని, సంబంధిత అధికారులను జైలుకు పంపుతామని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా..? లేదా..? స్పష్టంగా చెప్పండని ప్రశ్నించింది. చెట్లను నరికినందుకు జింకలు బయటకు వచ్చి కుక్కల దాడిలో చనిపోయాయని.. ఆ వీడియోలు చూసి ఆందోళనకు గురయినట్లు చెప్పుకొచ్చింది. అనుమతులు తీసుకోకుండా చెట్లను నరికినందుకు చీఫ్ సెక్రటరీ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. చీఫ్ సెక్రటరీని కాపాడాలనుకుంటే.. 100 ఎకరాలను ఎలా పునరుద్దరణ చేస్తారో చెప్పండంటూ ప్రశ్నించింది. చెట్ల పునరుద్ధరణను ప్రభుత్వ అధికారులు వ్యతిరేకిస్తే.. ఆ భూముల్లోనే టెంపరరీ జైలును కట్టి అందులోకి పంపిస్తామంటూ సీరియస్‌ కామెంట్స్‌ చేసింది. తాము చెప్పే వరకు హెచ్‌సీయూ భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకవద్దని ఆదేశించింది తీర్పు ఇచ్చాక కూడా హెచ్‌సీయూ భూముల్లో బుల్డోజర్లు ఎందుకు ఉన్నాయంటూ జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Latest News

స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్.. స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్..
పనుల్లో నిమగ్నమైన శామీర్పేట కళాకారులు.. గత ఏడాది అరుణాచలం..ఈ ఏడాది స్వర్ణగిరి.. ప్రతియేటా కొత్త తరహా ఏర్పాట్లతో ఆకట్టుకుంటున్న గణేష్..
ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..
ఛీ..ఛీ.. ఇదేం దందారా నాయనా..
మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక..
కడప జిల్లా పోలీస్ శాఖ ఘనత
అమ్మతనాన్నే అపహాస్యం చేసిన సృష్టి సెంటర్..
అచ్చం పుష్పా సినిమాను సేమ్ టు సేమ్ దింపేశారు..