స్పిరిట్ తో నకిలీ ఎంసీ విస్కీ తయారీ.. ముఠా అరెస్ట్
మూసేసినఫ్యాక్టరీలపై ఎక్సైజ్ పోలీసుల నిఘా ఎక్కువైంది. దీనితో నిందితులు కొత్త తరహా వ్యాపారం మొదలు పెట్టారు. రైస్ మిల్లులో ఎవరికి అనుమానం రాదని స్పిరిట్ తో లిక్కర్ తయారీ దందా సాగించారు. ఈ విషయం ఎక్సైజ్ అధికారులు గుట్టురట్టు చేశారు.
పెద్ద మొత్తంలో లిక్కర్ తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసి మరికొందరిపై కేసు నమోదు చేశారు.
హైదరాబాదులోని కృష్ణ పద్మ అనే స్పిరిట్ కంపెనీలో తయారైన స్పిరిట్ ను తీసుకొని కొంతమంది అక్రమార్కులు ఏకంగా నకిలీ లిక్కర్ తయారు చేసి అమ్మకాలు మొదలు పెట్టారు. శివ పార్వతి వైన్ షాప్ లో పనిచేస్తున్నటువంటి తోట శివకుమార్ అనే వ్యక్తి మరి కొంతమందితో కలిసి మైలవరం రామాపురం సమీపంలో ఉన్న రైస్ మిల్లులో కల్తీ ఎంసి విస్కీ తయారుకి శ్రీకారం చుట్టారు. ఈ విషయం ఈ మధ్యకాలంలో అమలాపురం రేవల్లి మార్కాపురం ప్రాంతాల్లో తనిఖీ చేసినప్పుడు కల్తీ మద్యం పట్టుబడింది. ఈ కల్తీ మద్యం ఎక్కడి నుంచి వస్తుందని సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా రైస్ మిల్లులో తయారవుతున్నట్లు అంజిరెడ్డి బృందం కనుగొన్నారు. రైస్ మిల్లుపై దాడి చేసి 15 లక్షల విలువ చేసే 38 పెట్టల విస్కీని, 20 లేబుల్ బండిల్స్, 178 బ్రాండ్స్ ని తొమ్మిది డబ్బాల స్పిరిట్ ను పదకొండు వేల కాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో తోట శివకుమార్, మల్లికార్జున్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరితోపాటు కృష్ణ ప్రేమ్, చరణ్ సింగ్, ఆర్ శ్రీనివాస్ అలియాస్ అబ్దుల్ కలాం అనే వ్యక్తులపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్టిఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు.