చిన్న నల్లబల్లిలో గిరిజనుల కోసం కొత్త డిఆర్ డిపో ప్రారంభం

On
చిన్న నల్లబల్లిలో గిరిజనుల కోసం కొత్త డిఆర్ డిపో ప్రారంభం

13-06-25 భద్రాచలం నియోజకవర్గం.

భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలో గల చిన్న నల్లబల్లి గ్రామంలో గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన డిఆర్ డిపో ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు రిబ్బన్ కట్ చేసి డిపోను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, “ఇది మారుమూల గిరిజన ప్రాంతమైన చిన్న నల్లబల్లిలో ప్రజలకు నిత్యవసరాలు అందుబాటులో ఉండేలా ఈ డిపో ఏర్పాటు చేయడం జరిగింది. స్థానికులు దీన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలి,” అని అన్నారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకలో మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ, మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువత, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest News