విద్యార్థుల భద్రత పట్ల అందరూ బాధ్యతగా ఉండాలి. సీపీ సీ.వి ఆనంద్
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ఆన్ స్టూడెంట్స్ సేఫ్టీ పైన రవీంద్రభారతిలో మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ పోలీస్ , లా అండ్ ఆర్డర్ పోలీస్ , జిహెచ్ఎంసి , ఆర్టీసీ , ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లు పాల్గొన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ , తల్లిదండ్రులు విద్యార్థుల పట్ల తీసుకోవాల్సిన భద్రత జాగ్రత్తల గురించి చర్చించారు. ముఖ్యంగా స్కూల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనకు సంబంధించి స్కూల్ మేనేజ్మెంట్ పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడారు. కార్యక్రమంలో సీపీ ఆనంద్, కలెక్టర్ హరిచందన, హైదరాబాద్ డీఈవో రోహిణి, ఆర్టీసీ ED రాజశేఖర్ , ట్రాఫిక్ JC జోయెల్ డేవిస్, ఆర్టీఏ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ స్కూల్స్ స్టార్ట్ అయినా సందర్బంగా స్టూడెంట్స్ సేఫ్టీ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని ప్రతి సంవత్సరం ఈ విధమైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు సేఫ్టీ సమస్యలు వస్తాయని వాటిని దృష్టిలో పెట్టుకొని అవగాహనా కలిగిస్తున్నామన్నారు. పిల్లలు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల మూడు సంవత్సరం లో 8 మంది మరణించారని, విద్యార్థులు స్కూల్ బస్సులోనే ప్రయాణం చేస్తుంటారు కాబట్టి ప్రతి పాఠశాలలో బస్సెస్ యొక్క సేఫ్టీ మేజర్స్ పాటించాలని, పిల్లలకి ఎలాంటి సమస్య వచ్చిన యాజమాన్యందే బాధ్యత అని చెప్పారు. సేఫ్టీ స్టాండర్డ్స్, కెమెరాస్, మెయింటెనెన్స్ ఎప్పుడూ ఉండేలాగా చూసుకోవాలని ఆనంద్ అన్నారు. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పరిసర ప్రాంతాలు గమనించాలి, అక్కడే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది, ఒక్క విద్యార్థి చనిపోయిన పాఠశాలకి పెద్ద సమస్యగా మారుతుందని చెప్పారు. ప్రతి ఒక్క పాఠశాల పరిసరాలలో సీసీ కెమెరాస్ ఉండేలాగా చూసుకోవాలని, పిల్లలు స్కూల్స్ కి ఓవర్ లోడెడ్ ఆటోలల్లో కూడా వెళ్తున్నారు, అలా వెళ్లడం వల్ల ప్రమాదాలు, మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పేరెంట్స్ దృష్టి పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలని, స్కూల్ పరిసర ప్రాంతాలలో సైన్ బోర్డ్ ఉండేలాగా చూసుకోవాలన్నారు. సిటీ పోలీస్ లో 3 వేల మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. సిటీ లో మొత్తం 650 జంక్షన్స్ ఉన్నాయి. సిబ్బంది కొరత వల్ల అందులో 325 జంక్షన్స్ ను మాత్రమే డిఇఓనే చేయగలుగుతున్నమన్నారు. ఏదిఏమైనా తమతోపాటు స్కూల్స్ యాజమాన్యం, తల్లిదండ్రులు అందరూ బాధ్యతగా మెలగాలని చెప్పారు. కార్యక్రమంలో పలు పాఠశాలల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.