సురారం పిఎస్ లో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ వాసుల ఫిర్యాదు..
By Ravi
On
మేడ్చల్ జిల్లా: సూరారం పిఎస్ పరిధిలో మొట్కానిగూడ మోడి ఎలిగ్నిసి అపార్ట్మెంట్ గేటడ్ కమ్యూనిటీలో దొంగతనం జరిగింది.
ఈ విషయంపై అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు
ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని సి.సి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమకు మోడి ఎలిగ్నిసి అపార్ట్మెంట్ గేటడ్ కమ్యూనిటీలో నెల నెల మెయిన్టనెన్స్ పేరుతో డబ్బులు తీసుకుంటూ ఎలాంటి సౌకర్యాలు అనగా సి.సి కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది మరియు శానిటరీలాంటివి కల్పించడం లేదని బిల్డర్ సౌరభ్ మోడి మరియు నిర్వాహకులు అశోక్ పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని అపార్ట్మెంట్ వాసులు సూరారం పోలీసులకి ఫిర్యాదు చేశారు. సూరారం పోలీసులు రెండు ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Related Posts
Latest News
11 Oct 2025 07:09:40
*ఆక్రమణలను తొలగించిన హైడ్రా*దాదాపు 12.50 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం*దాదాపు రూ. 1100 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

.jpeg)