మాజీ మంత్రి హరీష్ రావుకి అస్వస్థత.. కిమ్స్ కి తరలింపు
By V KRISHNA
On
బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సోమవారం సాయంత్రం హై ఫీవర్, అలసటతో బాధపడటంతో ఆసుపత్రిలో చేరారు. తెలంగాణ భవన్లో పార్టీ కార్యకలాపాలు ముగించుకున్న తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యారు. హరీష్ రావును బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను కలిసే సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లోనే కొనసాగుతూ, పార్టీ నేతలతో సమన్వయం చేశారు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు, తాజా పరిణామాలను గమనించారు.
Latest News
01 Jul 2025 23:59:30
* అమెరికాలో కొత్త పార్టీ అవసరమంటున్న ఎలన్ మస్క్* ఎలన్ మస్క్ పార్టీతో ప్రయోజనం ఉండదన్న ప్రచారం* మస్క్ జన్మ:తహా అమెరికన్ కాకపోవడం మైనస్