మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు

On
మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు

తెలంగాణ నార్కోటిక్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు భారీ మాదకద్రవ్యాల రవాణా దారుల ముఠా గుట్టురట్టు చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులతో కలిసి నిర్మల్ ప్రాంతంలో దాడులు చేసి అయిదు మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 425 కిలోల క్లోరల్ హైడ్రేట్, 1.15 కిలోల ఆల్ప్రాజోలమ్ స్వాదీనం చేసుకున్నారు. పట్టుబడిన సొత్తు మొత్తం విలువ రూ.52 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. 
మహారాష్ట్రలోని థానే జిల్లా, గణేశ్పురి తహసీల్, నింబవలి గ్రామంలో తయారు చేస్తున్న మత్తు పదార్థాలు అయిన క్లోరల్ హైడ్రేట్ మరియు ఆల్ప్రాజోలమ్ ను తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా 5 మంది నిందితులు రవాణా చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆయా మత్తు పదార్ధాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్ లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. 
అరెస్టైన నిందితుల వివరాలు:

1. బస్పల్లి రామ గౌడ్ s/o గంగాధర్ గౌడ్, వయసు: 45, వృత్తి: డ్రైవర్, నివాసం: తాడ్ బిలోలి, నిజామాబాద్ జిల్లా.
2. బుర్ర రమేష్ s/o రాజయ్య, వయసు: 36, వృత్తి: తాటి మద్యం షాప్, నివాసం: రాఘవపట్నం, కరీంనగర్.
3. కొట్టగిరి రాజం s/o నాగయ్య, వయసు: 59, వృత్తి: తాటి షాప్ లో పని, నివాసం: ఇటిక్యాల, కరీంనగర్.
4. ఎల్లండుల శ్రీనివాస్ s/o చిన్నన్న, వయసు: 44, వృత్తి: తాటి షాప్ లో పని, నివాసం: బుగ్గారం, కరీంనగర్.
5. బుర్ర రాజశేఖర్ s/o రాములు, వయసు: 34, వృత్తి: తాటి షాప్ లో పని, నివాసం: గోల్లపల్లె, కరీంనగర్.
స్వాధీనం చేసుకున్న సొత్తు...
1. క్లోరల్ హైడ్రేట్ – 425 కిలోలు
2. ఆల్ప్రాజోలమ్ – 1.115 కిలోలు
3. రెండు ఎర్టిగా కార్లు – MH47BB4666 & TS15EK9099
4. సెల్‌ఫోన్లు – 5
నిందితుల్లో ఒకరైన బస్పల్లి రామ గౌడ్, బాలానగర్ లో 560 కిలోల క్లోరల్ హైడ్రేట్ తో పట్టుబడ్డాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ అదే నేరానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని నింబవలి గ్రామం సమీపంలో గదిని అద్దెకు తీసుకుని మిగతా నిందితులతో కలసి మత్తు మందులు తయారు చేశాడు.  నిందితులు 17 బస్తాలు కలిగిన 425 కిలోల క్లోరల్ హైడ్రేట్ మరియు 1.115 కిలోల ఆల్ప్రాజోలమ్ ను రెండు కార్లలో నింపి మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రవాణా చేస్తుండగా నిర్మల్ జిల్లా, చిట్యాల వద్ద (భైంసా–నిర్మల్ రహదారిపై) పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి మత్తు పదార్థాలు కలిసిన తాటి కల్లు పట్ల ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని తెలిపారు.IMG-20250622-WA0078

Advertisement

Latest News