మూడున్నర కోట్ల విలువైన ఫోన్స్ రికవరీ
- ఫోన్స్ రికవరీలో రికార్డ్స్ బద్దలు కొట్టిన రాచకొండ పోలీసులు
- Ceir పోర్టల్ ద్వారా కనుగొన్నామన్న సీపీ సుధీర్ బాబు
- బాధితులకు ఫోన్స్ అందజేత
మల్కాజిగిరి : రాచకొండ(Rachakonda police) పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను(cellphones) పోలీసులు గుర్తించి వాటిని తిరిగి బాధితులకు అందజేశారు. మొత్తం 1130 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో రాచకొండ పోలీసులు విజయవంతమయ్యారు. ఈ ఫోన్ల విలువ సుమారుగా మూడునన్నర కోట్లు (₹3.5 కోట్లు) ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలిపారు.
ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి పోలీస్ స్టేషన్ల పరిధుల్లో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, సి.ఈ.ఐ.ఆర్ (CEIR) అనే కేంద్ర ప్రభుత్వ పోర్టల్ సహాయంతో పోలీసులు ఫోన్లను గుర్తించారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను పోలీసులు బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రజలకు మంచి చేయడమే తమ లక్ష్యమని, మొబైల్ పోగొట్టుకున్న వారు CEIR పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.