సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలి:హైకోర్టు

On
సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలి:హైకోర్టు

హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం దగ్గర పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లో వార్డుల విభజన చేయాలని పేర్కొంది. కాగా ఎన్నికల నిర్వహణకు 30 రోజుల సమయం కావాలని ప్రభుత్వం, 60 రోజుల గడువు కావాలని HCని SEC కోరిన విషయం తెలిసిందే. దీంతో సర్పంచ్ ఎలక్షన్స్ సెప్టెంబర్ లోపు జరగనున్నాయి.

Advertisement

Latest News