తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులకు డీజీపీ డెడ్లైన్..!
By Ravi
On
తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ సూచించారు. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవని.. మెడికల్ వీసాల మీద ఉన్నవారికీ ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉందని గుర్తుచేశారు. లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదన్నారు. పాకిస్థానీలు తమ దేశానికి అటారి బోర్డర్ నుండి వెళ్లొచ్చని.. ఈనెల 30 వరకు అటారి బోర్డర్ తెరుచుకుని ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాల్సందేనని స్పష్టం చేశారు. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Latest News
31 Jul 2025 06:44:14
పేదలకు దూరమవుతున్న ఆధునిక వైద్య సేవలు నిమ్స్ ‘ముఖ్యుడి' నిర్లక్ష్యంతో గాడితప్పిన పాలన కేసులు, అవినీతి ఆరోపణలు, అంతర్గత కలహాలు అల్లకల్లోలం అయినా పట్టని పాలకులు, ప్రభుత్వ...