BC Reservations: బీసీ రిజర్వేషన్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. ముస్లిం కోటాపై అభ్యంతరం

By PC RAO
On
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. ముస్లిం కోటాపై అభ్యంతరం

బీసీ రిజర్వేషన్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపాటు

ముస్లిం కోటాపై అభ్యంతరం

రు. ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా నుండి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. తక్షణమే బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించి 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే దక్కేలా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 51 శాతమున్న బీసీలకు 32 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 12 శాతమున్న ముస్లింలకు మాత్రం వందకు వంద శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు సిద్ధమవడం సరికాదని అభిప్రాయపడ్డారు. 
 బనకచర్ల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాల సీఎంలతో సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వాదనను బలంగా విన్పించాలని కోరారు.  


కేంద్రానికి అన్ని రాష్ట్రాలూ సమానమేనన్న బండి సంజయ్.. ఏ రాష్ట్రానికి అన్యాయం చేయదన్నారు. బనకచర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర వాదనను సీఎంల సమావేశంలో రేవంత్ రెడ్డి గట్టిగా వినిపించాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ల అమలు వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ప్రభుత్వం వాస్తవాలను కప్పి పుచ్చే ప్రయత్నం చేస్తోందని.. అవాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు చేరవేస్తోందని విమర్శించారు. కొన్ని బీసీ సంఘాలు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వైఎస్ హయాంలో ముస్లింలను బీసీల్లో చేర్చి 4 శాతం రిజర్వేషన్లను అమలు చేసింది. ఆ టైంలోనే బీసీ సంఘాలు అడ్డుకుని ఉంటే బీసీలకు అన్యాయం జరిగేది కాదన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని. ఇప్పుడు 10 శాతం ఇస్తామనడం దారుణమన్నారు బండి సంజయ్. 

బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే.. “వాస్తవానికి బీసీ జనాభా రాష్ట్రంలో 51 శాతం ఉంది. సమగ్ర కుటుంబ సర్వేలోనే ఈ విషయాన్ని తేల్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన పేరుతో బీసీల జనాభాను 46 శాతానికి తగ్గించారు. అంటే బీసీల సంఖ్యను 5 శాతం తగ్గించేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతూ అందులో 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు అమలు చేస్తున్నారు. తద్వారా బీసీలకు దక్కే రిజర్వేషన్లు 32 శాతమే. మోదీ ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అదనంగా ఇస్తున్న రిజర్వేషన్లు 5 శాతమే. దీనివల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అట్లాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అందులో ముస్లింలు లబ్ది పొందుతున్నారు. రాష్ట్రంలో 12 శాతం మంది ముస్లింలు ఉంటే... కాంగ్రెస్ 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ముస్లింలకు ఇకపై వందకు వంద శాతం రిజర్వేషన్లు పొందబోతున్నారు. బీసీలకు మాత్రం తీవ్రమైన అన్యాయం జరగబోతోంది.” విమర్శించారు.

ప్రస్తుతం బండి సంజయ్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. దీనిపై అధికార కాంగ్రెస్ తో పాటు ఎంఐఎం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి

Advertisement

Latest News

నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!  నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!
66 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లుజనసేనకు 9, బీజేపీకి 4  చైర్మన్ల పదవులుబీసీలకు 17, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనారిటీలకు 566 మార్కెట్ కమిటీ చైర్మన్లలో...
చిట్‌చాట్ పేరుతో విషం చిమ్మితే కోర్టుకు లాగుతా..!
ఫోన్ ట్యాపింగ్ కేసు - కేంద్రమంత్రి బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారు?
కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం
రాయుడు హత్య కేసులో రూ.30లక్షల ఆఫర్.. పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారు..? రాయుడి చెల్లెలు ప్రశ్నలు
అడవిని మింగేస్తున్న బొగ్గు బట్టీలు..! తగ్గిపోతున్న వృక్ష సంపద
బాలయ్య స్క్విడ్ గేమ్ ఆడితే..అంతా దబిడిదిబిడే!