నా సినిమా అనాథ కాదు..! వీరమల్లుపై పవన్ కల్యాణ్ షాకింగ్ కామెంట్స్..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు.. రికార్డు స్థాయిలో 14సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఈనెల 24న రిలీజ్ కు రెడీ అయింది. పవన్ పాలిటిక్స్ లో బిజీ కావడంతో ఏళ్ల తరబడి సినిమా షూటింగ్ జరిగింది. పవన్ కెరీర్ లో తొలి హిస్టారికల్ మూవీ అందునా ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ కూడా ఇదే. ఈ సినిమాకు తొలుత క్రిష్ దర్శకత్వం వహించగా.. ఆ తర్వాత నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ ఎంటరై సినిమాను పూర్తి చేశాడు. మొత్తానికి సిల్వర్ స్క్రీన్ పై మెరిసేందుకు సిద్ధమైన వీరమల్లు మూవీ కోసం ప్రమోషన్స్ గట్టిగానే చేస్తోంది చిత్రయూనిట్. ఈ క్రమంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది. మూవీ ప్రమోషన్స్ కు కాస్త దూరంగా ఉండే పవన్ కల్యాణ్ ఈ ప్రెస్ మీట్ కు హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రెస్ మీట్ లో పవన్ మాట్లాడుతూ.. పోడియం లేకుండా మాట్లాడటం తనకు కాస్త కష్టంగా ఉంటుందని.. పైగా సినిమాల పరంగా ప్రెస్ మీట్ లో మాట్లాడటం కూడా ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పారు. అంతేకాదు సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో కూడా తనకు తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు పవన్. ఒక సినిమా తీయాలంటే ఎన్నో ఇబ్బందులు పడాలని.. అది మామూలు విషయం కాదని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే తన ఫిల్మ్ కెరీర్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్.. తానో యాక్సిడెంటల్ యాక్టర్‌నని.. వేరే గతిలేక సినిమాల్లోకి వచ్చానన్నారు. రాజకీయాల వల్ల సినిమాలకు దూరమైనా.. మళ్లీ యాక్టింగ్ చేయాలని ఏఎం రత్నం కోరడంతోనే రీ ఎంట్రీ ఇచ్నానన్నారు. అందుకనే హరిహర వీరమల్లుకి ఎంత బెస్ట్ ఇవ్వాలో అంతా ఇచ్చానని చెప్పారు పవన్. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాలకు టైమ్ కేటాయించలేకపోయినా క్లైమాక్స్ కోసం ఏకంగా 57 రోజులు ఇచ్చానన్ని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పూర్తైనన వీరమల్లు సినిమా అనాథ కాదని.. అందుకే తాను ఇక్కడికి వచ్చానని ఎమోషనల్ కామెంట్స్ చేశారు పవన్.
ఇతర హీరోలతో పోలిస్తే తన సినిమా బిజినెస్ కూడా అంత బాగా జరగదని.. ఈ సినిమాకి ఎంత మేర కలెక్షన్స్ వస్తాయనేది ప్రేక్షకుల ఆదరణను బట్టి ఉంటుందన్నారు. మొత్తానికి పవన్ చేసిన కామెంట్స్ కాస్త ఎమోషనల్ గా ఉన్నా.. వీరమల్లుకు ఎంతమేరకు ప్లస్ అవుతాయనేది వేచి చూడాలి.