అమ్మ వారికి బోనం సమర్పించిన బండ్లగూడ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్

On
అమ్మ వారికి బోనం సమర్పించిన బండ్లగూడ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్

ఆషాడమాసం బోనాల ఉత్సవాలు పురస్కరించుకొని బండ్లగూడ తహసిల్దార్ కె. ప్రవీణ్ కుమార్ లాల్ దర్వాజ అమ్మవారికి బోనం సమర్పించారు. ఆయనతో పాటు డిప్యూటీ తహశీల్దార్ రాధికా , రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివ కుమార్ , మధుసూదన్ రెడ్డి, vro కృష్ణ గౌడ్, మహేష్ కుమార్ , చార్మినార్ mro నిహారిక , అసిస్టెంట్ ఆఫీసర్ శ్రీదేవి , రికార్డు ,సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ , రాజేందర్ తదితరులు భాజా భజంత్రీలతో జోగిని భబిత నుత్యాలతో వెళ్లి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి చైర్మన్ బి .మారుతి యాదవ్, ప్రచార కర్త యశ్వంత్ కుమార్ గౌడ్ లు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కె. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి తహసిల్దార్ ఆధ్వర్యంలో బోనం సమర్పించడం సంతోషకరంగా ఉంది. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు . ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Latest News

 పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్ పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్
హైదరాబాద్: వనస్థలిపురంలో విషాదం అలుముకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని ఓ కుటుంబ సభ్యులు ఆసుపత్రిపాలైనారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో నివాసం వుండే శ్రీనివాస్ ఇంట్లో...
మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ..
భర్త పుట్టినరోజుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భార్య..
జుపే గేమ్ యాజమాన్యంపై కేసు నమోదు
అమ్మ వారికి బోనం సమర్పించిన బండ్లగూడ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్
నిషా నషాలానికి ఎక్కి.. పార్కింగ్ చేసిన వాహనాలపై చూపించాడు
ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బొంగునూరి కిషోర్ రెడ్డి